మరి మీ ఫేవరెట్ టీచర్‌కి ఎలాంటి బహుమతులు ఇవ్వాలనుకుంటున్నారు? ఐడియా లేకపోతే ఒక లుక్కేయండి.
పుస్తకం: చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం టీచర్ కి ఇచ్చుకో.. ఈ ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి.
పెన్: పుస్తకం, డైరీ ఇచ్చారు మరి రాసుకోవడానికి పెన్ ఇవ్వాలిగా. విద్యార్థులు రాసిన ఎగ్జామ్ పేపర్లే కాదు, వారి జీవితాన్ని కూడా కరెక్షన్ చేస్తారు.
కాబట్టి రెడ్ కలర్ పెన్ ఇవ్వండి. దీంతో పాటు మీ టీచర్ కి ఇష్టమైన కలర్ పెన్, కలర్ పెన్సిల్స్ కూడా ఇవ్వచ్చు.
పెన్ స్టాండ్: పెన్లు ఇచ్చారు సరే. పెన్లు పెట్టుకోవడానికి పెన్ స్టాండ్ ఒకటి ఇచ్చేస్తే బాగుంటుంది.
గ్రీటింగ్ కార్డ్: ఇది కూడా మంచి బహుమతే. మీ టీచర్ ఫోటోను గ్రీటింగ్ కార్డు మీద అతికించి ఇస్తే చాలా సంతోషిస్తారు. గ్రీటింగ్ కార్డు మీద కవిత్వం ద్వారా మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు.
కాఫీ మగ్: కాఫీ మగ్ మీద మీ టీచర్ ఫోటోను ప్రింట్ చేయించి.. మీ అభిమానాన్ని అక్షరాల రూపంలో రాసి ఇస్తే టీచర్ చాలా సంతోషిస్తారు.
వాచ్ ఇది లైఫ్ లో చాలా ముఖ్యమైన వస్తువు. పైగా ఇది ఎప్పుడూ మీ టీచర్ చేతికే ఉంటుంది. వాచ్ చూసినప్పుడల్లా మీరే గుర్తొస్తారు.
మొక్క: మీ టీచర్ కి మొక్కలంటే ఇష్టముంటే ఒక మొక్కను బహుకరించండి. ఆ మొక్కకి నీళ్లు పోసిన ప్రతి సారీ మీరే గుర్తుకొస్తారు.
వాలెట్: మాస్టర్ సినిమాలో చిరంజీవిలా మీ సార్ కూడా హీరో అయితే బ్యాక్ పాకెట్ లో పెట్టుకోవడానికి ఒక వాలెట్ ఇవ్వండి.
వాలెట్ లో మీ సార్ ఫోటో గానీ, మీ సార్ కి నచ్చిన దేవుడి ఫోటో గాని పెట్టి ఇవ్వండి. చాలా సంతోషిస్తారు.
హ్యాండ్ బ్యాగ్: మీ టీచర్ కి ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ బహుమానంగా ఇవ్వండి. కుదిరితే ఆ బ్యాగ్ లో చాక్లెట్స్, పెన్, పాకెట్ డైరీ లాంటి వస్తువులు ఉంచండి.
లెటర్ నోట్: మీ టీచర్ మీద ఉన్న ప్రేమని మీ చేతులతో పేపర్ మీద రాసి ఇవ్వండి. కుదిరితే ఒక కవిత్వ రూపంలో మీ ప్రేమని వ్యక్తపరచండి.
ఫోటో ఫ్రేమ్: మీ టీచర్ తో కలిసి దిగిన మంచి ఫోటో ఉంటే ఫ్రేమ్ కట్టించి బహుమతిగా ఇవ్వండి. టీచర్ ఇంటి గోడ మీదే కాదు, టీచర్ గుండె గదిలో కూడా మీరే వేలాడుతుంటారు.
మీ టీచర్ కి చాక్లెట్స్ అంటే ఇష్టమా? అయితే మంచి రుచికరమైన చాక్లెట్స్ ను టీచర్స్ డే సందర్భంగా మీ టీచర్ కి గిఫ్ట్ గా ఇవ్వండి.