చిన్న పిల్లలు అల్లరి చేయడం కామన్. అలాగని వారిని గట్టిగా తిట్టకూడదు.

మనమూ చిన్నప్పుడు అల్లరి చిల్లర పన్లు చేసిన వాళ్లమే అని మర్చిపోవద్దు.

ప్రతీ ఒక్క తల్లిదండ్రులు తెలిసో.. తెలికో తమ పిల్లలపై కొన్ని రకాల ఒత్తిడులు పెడుతూ ఉంటారు.

నిపుణుల ప్రకారం పిల్లల పై ఒత్తిడి, ఆంక్షలు పెడితే పలు రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

మరి ఏ విషయాల్లో పిల్లలను బలవంతం పెట్టకూడదో ఇప్పుడు చూద్దాం.

పిల్లలు అబద్దాలు చెబితే.. తప్పు అని చెప్పడం కరక్టే. కానీ అబద్దం చెప్పమని మనం పిల్లల బలవంతం చేయరాదు. ఇది వారికి భవిష్యత్తులో సమస్యగా మారే ప్రమాదం ఉంది. 

చాలా మంది పిల్లలకు ఆకలి లేదు అని తెలిసినా.. బలవంతంగా తినిపించాలని చూడటం చేయకూడదట. వారికి ఆకలి అయినంత వరకే తినిపించాలి అని నిపుణులు సూచిస్తూన్నారు.

ముఖ్యంగా కొత్తవారికి ముద్దు పెట్టమని, హగ్ ఇవ్వమని అస్సలు బలవంత పెట్టకూడదు.

మీ పిల్లల చేసింది తప్పు కాకపోయినా.. ఎదుటివారికి క్షమాపణలు చెప్పించడం లాంటివి చేయకూడదు.

చివరిగా పిల్లలు కడుపునిండా తినే అవకాశం ఇవ్వాలి. వారిని డైట్ చేయమని బలవంతం పెట్టకూడదు.