రాత్రి సమయంలో పాలు తాగితే హాయిగా నిద్ర పడుతుంది. శారీరక శ్రమ చేయని వాళ్ళు పగటి పూట పాలు తాగితే జీర్ణమవ్వడం కష్టమవుతుంది.

ఉదయాన్నే జున్ను తినచ్చు. అయితే మితంగా తింటే శరీర బరువును అదుపులో పెట్టుకోవచ్చు.

రాత్రిపూట జున్ను తింటే జీర్ణమవ్వడం కష్టం. దీని వల్ల కొవ్వు పెరిగిపోతుంది.

అరటి పండు మధ్యాహ్న సమయంలో తింటే జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. అది సహజ యాంటాసిడ్‌గా పనిచేసి గుండెల్లో మంటను తగ్గిస్తుంది.

రాత్రి సమయంలో అరటి పండు తింటే ఊపిరితిత్తుల్లో కఫం చేరి దగ్గు, జలుబు వస్తాయి.

అరటి పండులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖాళీ కడుపుతో తినకూడదు.

పెరుగును పగటి పూట తీసుకోవాలి. జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.

వృద్ధులు, దగ్గు, జలుబుతో బాధపడేవాళ్ళు రాత్రి పూట పెరుగు తినకూడదు.

మాంసంలో అధిక ప్రోటీన్లు ఉంటాయి. ఉదయం మాంసం తింటే ఏకాగ్రత పెరుగుతుంది. మధ్యాహ్నం తినడం కూడా మంచిదే.

రాత్రి సమయంలో జీర్ణక్రియ నెమ్మదిగా పనిచేస్తుంది. కాబట్టి మాంసం అరగడానికి సమయం పడుతుంది. దీని వల్ల ఇబ్బంది కలుగుతుంది.

వాల్‌నట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌, ఒమేగా-3 ఫ్యాట్స్ లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. 

ఇవి మెదడుని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే వీటిని సాయంత్రం తీసుకుంటే మంచిది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో తినడం వల్ల ఉపయోగం లేదు.

చక్కెర శరీరంలోని ఇన్సులిన్‌ చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. శారీరక శ్రమ చేసేవారు ఉదయం పూట చక్కెర పదార్థాలు తింటే మంచిది.

రాత్రి పూట చక్కెర పదార్థాలు తీసుకోవడం వల్ల కొవ్వు పెరిగే అవకాశం ఉంది. జీర్ణమవ్వక నిద్ర కూడా సరిగా పట్టదు.