మనిషి శరీరానికి తాజా పండ్లు ఎంతో మేలు చేస్తాయి.

ఇక పండ్లలో ఉండే విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి.

ఐతే ఈ విత్తనాల్లో కొన్ని రకాలను మాత్రం అస్సలు తిన కూడదు అని వైద్యులు సూచిస్తున్నారు.

ఎందుకంటే ఆ గింజల్లో అత్యంత హానికరమైన విషపదార్థాల సమ్మేళనాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరి ఆ విషపూరితమైన విత్తనాలు ఏవో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

అయితే ఆపిల్ విత్తనాల్లో సైనైడ్ ఉంటుందని వాటిని అధిక మెుత్తంలో తీసుకుంటే మరణానికి సైతం దారితీస్తుందని చెబుతున్నారు.

చెర్రీలు మన బాడీకి అధిక పోషకాలను అందిస్తాయి. కానీ వాటి గింజల్లో కూడా సైనైడ్ మిశ్రమం ఉంటుందని దాంతో వాటిని తినరాదని వైద్యులు సూచిస్తున్నారు.

దీనిలో విషపదార్థాలు అయిన అమిగ్డాలన్, సైనోజెనిక్ గ్లైకోసైడ్లు ఉంటాయి. అందుకే ఈ విత్తనాలను తినరాదు. దీని వల్ల శరీరం బలహీనపడుతుంది.

పీచ్ విత్తనాల్లో కూడా కొన్ని రకాల విషపదార్థాలు ఉంటాయి. వాటిని తినడం వల్ల పొత్తికడుపు నొప్పి, నీరసం వస్తాయి.

ఈ పండులోని విత్తనాల్లో సైనైడ్ సమ్మెళనాలు ఉంటాయి. 

దాంతో విటిని తింటే చెమట, అలసట సమస్యలతో పాటు కోమాకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు.