ప్రతి ఏడాది వినాయక చవితిని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం.

 వినాయకుడికి 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు.

వినాయక చవితి రోజే కాకుండా ఏ శుభకార్యాలు జరిగిన తొలి పూజ బొజ్జ గణపయ్యకే చేస్తారు

అయితే ప్రతి శుభకార్యంలో తొలిపూజ వినాయకుడికే ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

పురాణాల ప్రకారం.. రాక్షసుల పెట్టే బాధల నుంచి కాపాడమని దేవతలందరూ శివపార్వతులను వేడుకుంటారు.

దేవతల కోరిక మేరకు పార్వతీ పరమేశ్వరులు విఘ్నేషుడిని పుట్టిస్తారు. 

రాక్షసుల పెట్టే ఇబ్బందుల నుంచి దేవతలను వినాయకుడు రక్షిస్తాడు.

అందుకే విఘ్నాలను తొలగించే వినాయకుడినే మొదటిగా పూజించాలని పురాణాలు తెలియజేస్తున్నాయి.

వినాయకుడికి ఒక్క దేవతలే కాదు.. మనుషులు కూడా మొదటి పూజలు నిర్వహిస్తారు. 

గణపతికి తొలి పూజ చేయడం వల్ల మన సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం.

బ్రహ్మదేవుడు కూడా మొదటగా వినాయకుడినే పూజించినట్టు పురాణాలు చెబుతున్నాయి. 

మరో పౌరాణిక కథ ప్రకారం....దేవతలు వారి యొక్క శక్తిని పరీక్షించాలని కోరుకున్నారు.

ఈ క్రమంలో దేవతలు తమ వాహనాలతో పోటీకి సిద్ధమవుతారు. 

ఇతర దేవతల వాహనాలకంటే వినాయకుడి వాహనం భిన్నమైనది, తెలివైనది. 

దీంతో ఈ పోటీలో వినాయకుడు గెలిచి.. శివపార్వతులచే విజేతగా ప్రకటించబడుతాడు.

దీంతో అప్పటి నుంచి వినాయకుడికి తొలి పూజలు నిర్వహిస్తారని పురాణాలు చెప్తున్నాయి.