భారత క్రికెట్ లో మోస్ట్ ఎగ్రెసివ్   క్రికెటర్ ఎవరంటే.. అందరూ  ఠక్కున చెప్పేపేరు.. ‘విరాట్ కోహ్లీ’.

ఈ రన్ మెషిన్ మైదానంలోకి వచ్చాక  తన భావోద్వేగాలను అదుపులో  పెట్టుకోవడం అనేది జరగదు.

అందుకే.. మైదానంలో అతని  హాహాభావాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి.  ప్రత్యర్థి జట్టు ఏదైనా..

మ్యాచ్ ఎలాంటి పోసిషన్ లో ఉన్నా, తన  బాడీ లాంగ్వేజ్ మాత్రం మారదు. ఇది  నార్మల్ గా ఉన్న కోహ్లీ.

అదే కోహ్లీ.. కోపంతో ఉంటే ఎలా ఉంటాడో  తెలుసా? ఆ సమయంలో జట్టులోని ఇతర  ఆటగాళ్లు, అతన్ని ఎదుర్కోవడానికే  బయపడిపోతారట.

కోహ్లీ గురుంచి అలాంటి మరెన్నో  విషయాలను రిషబ్ పంత్  బయటపెట్టాడు.

“నేను ఎవరికీ భయపడను, విరాట్  భయ్యా కే గుస్సే సే దార్ లగ్తా హై (విరాట్  కోహ్లి కోపానికి నేను భయపడుతున్నాను)”.

ఇది అన్ని సమయాలలో ఉన్నట్లు కాదు,  వ్యక్తులు తప్పు చేస్తున్నప్పుడు మాత్రమే.

అందుకే, కోహ్లీ చుట్టూ ఉన్నప్పుడు,  ఇతరులు తప్పు చేయకుండా ఉంటారు ”  అని పంత్ పేర్కొన్నాడు.

అందుకు సంబంధించిన వీడియో సోషల్  మీడియాలోవైరలవుతోంది.

ఆగస్టు 28న దుబాయ్‌ వేదికగా జరిగే తొలి  మ్యాచ్‌లో భారత్ జట్టు, పాకిస్థాన్‌తో  తలపడనుంది.

ఇప్పటికే రోహిత్ శర్మ సారధ్యంలో తమ  సన్నాహాలు మొదలుపెట్టింది.

ఇప్పటివరకు 14 సార్లు ఆసియా కప్ టోర్నీ  జరగగా, భారత జట్టు 13 సార్లు పాల్గొని, 7  సార్లు విజేతగా నిలిచింది.

ఇప్పుడు మరోసారి టైటిల్ నెగ్గి తిరుగులేని  శక్తిగా నిలవాలనుకుంటోంది.

రిషబ్ పంత్ వ్యాఖ్యలపై మీ  అభిప్రాయాలను కామెంట్ల రూపంలో  తెలియజేయండి.