ఇంగ్లాండ్ స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్   అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

     క్రికెట్ చరిత్రలోనే మరెవరికీ సాధ్యంకాని          రికార్డును అందుకున్నాడు.

సొంతగడ్డపై 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన తొలి  ప్లేయర్‌గా జేమ్స్ అండర్సన్ చరిత్రకెక్కాడు.

2002లో క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన  అండర్సన్.. 2003లో జింబాబ్వేతో  తొలి టెస్ట్ ఆడాడు.

తాజాగా, సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో  టెస్టుతో స్వదేశంలో 100 టెస్టుల మార్కును  అందుకున్నాడు.

23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కలిగిన క్రికెట్ దిగ్గజం  సచిన్ టెండూల్కర్‌కు కూడా  ఈ రికార్డు సాధ్యం కాలేదు.

సచిన్ సొంతగడ్డపై 94 మ్యాచ్‌లు మాత్రమే  ఆడి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

జేమ్స్ అండర్సన్ – 100

సచిన్‌ టెండూల్కర్‌ – 94

రికీ పాంటింగ్‌ – 92

స్టువర్ట్‌ బ్రాడ్‌ – 91

ప్రస్తుతం అండర్సన్‌ 40 ఏళ్లు. ఒకవైపు వయసు  మీద పడుతున్నా తన బౌలింగ్‌లో మాత్రం  పదును తగ్గడం లేదు.

ఇప్పటివరకు తన 19 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 174  టెస్టులాడిన అండర్సన్‌ 658 వికెట్లు సాధించాడు.

టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన  జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.