ఆడవాళ్లకు అందం పట్ల ఎంతో జాగ్రత్త, శ్రద్ధ ఉంటాయి.

అందంగా కనిపించేందుకు ఎన్నో రకాల కాస్మొటిక్స్‌, క్రీములు వంటివి ఉపోయోగిస్తుంటారు.

కొన్నిసార్లు బ్యూటీ కోసం కాస్త ఎక్కువగానే ఖర్చు చేయాల్సి వస్తుంది.

కానీ, ఇప్పుడు చెప్పుకోబోయేవి మీ ఆహారంలో భాగం చేసుకుంటే.. ఆరోగ్యంతో పాటు అందం కూడా మీ సొంతం అంవుతుంది.

పాలు.. ఆడవాళ్లు ఫ్యాట్‌ కంటెంట్‌ తక్కువగా ఉండే పాలను రోజూ తాగాలి.

పాలు తాగడం వల్ల కాల్షియం, విటమిన్ డి, సీ శరీరానికి అందుతాయి. ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది.

కొవ్వు తక్కువగా ఉండే పెరుగును ఆడవాళ్లు తరచూ తింటూ ఉండాలి.

అలా తినడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం చాలా తగ్గుతుందని చెబుతున్నారు.

టమాటాలను ఆడవాళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇవా వారికి మంచి ఔషదంలా పనిచేస్తాయి.

టమాటాల వల్ల క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులు దరి చేరవని నిపుణులు చెబుతున్నారు.

సోయాబీన్స్‌ ను తరచుగా తీసుకోవడం వల్ల ఆడవాళ్లకు ఎంతో మేలు చేకూరుతుంది.

వీటిలో ఉండే పోషకాలు ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా అందంగా మారుస్తాయి.

డ్రై ఫ్రూట్స్‌.. వీటిని మగవారి కంటే ఆడవారే ఎక్కువగా తీసుకోవాలంటూ చెబుతున్నారు.

డ్రై ఫ్రూట్స్ రోజూ తినడం వల్ల ఆడవాళ్లు ఎంతో బలంగా ఉంటారు.

బెర్రీలను కూడా రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇవన్నీ తినడం వల్ల ఆరోగ్యమే కాదు.. అందం కూడా పెరుగుతుంది.