నిమ్మకాయలో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉండడంతో ఇది మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది.

చాలా మంది ఆరోగ్యంగా ఉండటానికి, బరువు తగ్గడానికి రోజూ ఉదయాన్నే లెమన్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు.

ఇది రోజంతా కూడా మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి సైతం ఈ లెమన్ టీని ఎంతోగానో ఉపయోగపడుతుంది. దీంతో చాలా మంది లెమన్ టీని తీసుకుంటుంటారు.

లెమన్ టీ జీవక్రియను వేగవంతం చేయడానికి పని చేస్తుందట. దీంతో పాటు ఉబ్బరం నుంచి కూడా ఉపశమనం కలిగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

లెమన్ టీ అనేది అధిక రక్తపోటు సమస్య నుంచే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా చాలా ఈజీగా తగ్గిస్తుందట.

లెమన్ టీలో అల్లం జోడించడం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. అల్లం వికారం సమస్యను అధిగమించడానికి బాగా సహాయపడుతుంది.

లెమన్ టీ తాగడం ద్వారా రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

లెమన్ టీ తీసుకోవడం వల్ల  రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుందని డాక్టర్లు సిఫార్సు చేస్తూ ఉంటారు.

అంతే కాకుండా లెమన్ టీ తాగడం ద్వారా శరీరంలో ఐరన్ లోపాన్ని కూడా నివారించడానికి బాగా పనిచేస్తుందట.

తరుచు లెమన్ టీ తాగడం ద్వారా కండరాల నొప్పిని తగ్గించడంతో పాటు ఎనర్జీ లెవెల్ కూడా పెంచుతుందట. అందుకే వైద్యులు లెమన్ టీని తాగమని సూచిస్తున్నారు.

ఇలాంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే మోతాదులో లెమన్ టీ తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.