సోషల్ మీడియా వాడకం పెరిగాక సెలబ్రిటీలు అభిమానులకు మరింత దగ్గరయ్యారు అనడంలో సందేహం లేదు. .

అందుకు తగ్గట్టుగానే తారలు సైతం తమ పిక్స్ ను, తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు

తాజాగా ఓ హీరోయిన్ తనకు ట్వీన్స్ పుట్టారని సోషల్ మీడియా ద్వార తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

నమిత. వెంకటేష్ నటించిన జెమిని చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. 

తరువాతం సొంతం, ఒక రాజు ఒక రాణి లాంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది.

మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ తర్వత బాలయ్యతో సింహా చిత్రంలో మెరిసింది. తరువాత తమిళ కన్నడ, హిందీ సినిమాలలో సైతం నమిత నటించింది. 

నమిత కొద్దిగా బొద్దుగా మారడంతో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.

ఈ నేపథ్యంలోనే 2017లో తన బాయ్ ఫ్రెండ్ వీరేంద్ర చౌదరిని పెళ్లాడింది. అయితే ఈ అమ్మడు అభిమానులతో ఓ సంతోషకరమైన వార్త పంచుకుంది.

అదేంటంటే నమితకు పండంటి ఇద్దరు మగ బిడ్డలు (ట్విన్స్) జన్మించారు. ఈ విషయాన్నే తన ఇన్ స్టా లో షేర్ చేసింది.

తన ఆనందాన్ని తెలుపుతూ..” శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు ఈ శుభ వార్తను మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.

ఆ దేవుడి ఆశీర్వాదం వల్ల మాకు ట్విన్స్ పుట్టారు. వారికి మీ ఆశీర్వాదం కూడా కావాలి.

అంటూనే తనను హస్పిటల్ లో చాలా బాగా చూసుకున్నందుకు ఆసుపత్రి యాజమాన్యానికి అలాగే డా. భువనేశ్వరీ, డా.ఈశ్వర్, డా. వెళ్లు మురుగన్ లకు చాలా థ్యాక్స్ హ్యాపీ జన్మాష్టమి ”అంటూ రాసుకొచ్చారు.

అయితే గతంలో నమిత బేబీ బంప్ ఫొటోలను కూడా తన బ్లాగ్ లో షేర్ చేయగా అవి నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

అయితే గతంలో నమిత బేబీ బంప్ ఫొటోలను కూడా తన బ్లాగ్ లో షేర్ చేయగా అవి నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.