ఫ్రిజ్‌ వాడకం లేనప్పుడు కూరగాయలు, పండ్లు, ఆహారాలను నిల్వ చేయడం చాలా ఇబ్బందిగా ఉండేది.

కూరగాయలు, పాలు వంటివి తర్వగా పాడయ్యేవి.

ప్రస్తుతం ఫ్రిజ్‌ వినియోగంతో ఆహారా పదార్థాలు, పాలు, కూరగాయలు, పండ్లు ఇలా అన్నింటిని దానిలో నిల్వ చేస్తున్నాం.

అయితే అన్ని పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు.

ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో అస్సలు నిల్వ చేయకూడదు. ఇలా చేస్తే అవి మృదువుగా మారుతాయి. పైన తేమ చేరి.. త్వరగా బూజు పట్టేందుకు అవకాశం ఉంటుంది.

అలాగే ఉల్లిపాయలను ఇతర కూరగాయల నుంచి వేరు చేసి వాటిని వేరే చోట నిల్వ చేయాలి. లేదంటే వాటి నుంచి వచ్చే వాసనకు కూరగాయలు పాడవుతాయి.  

అరటి పండ్లను కూడా ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. 

అరటి పండ్లకు సహజసిద్ధమైన రుచి ఉంటుంది. వీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఆ రుచి పోతుంది.

అంతేకాక అరటి పండ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే.. దానిలో ఉండే పొటాషియం తగ్గిపోతుంది.

అందుకే అరటి పండ్లను ఎప్పుడూ గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాలి.

బంగాళాదుంపలను కూడా ఫ్రిజ్‌లో పెట్టరాదు. పెడితే వాటి సహజసిద్ధమైన రుచి పోతుంది.

బంగాళదుంపలను ఎక్కువ రోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచితే వాటిల్లో ఉండే పిండి పదార్థం మరింత తియ్యగా మారుతుంది.

పైగా ఇలా ఫ్రిజ్‌లో నిల్వ  చేసిన బంగాళాదుంపలను అస్సలు తినరాదు. 

కనుక బంగాళాదుంపలను కూడా గది ఉష్ణోగ్రత వద్దే నిల్వ ఉంచాలి. ఫ్రిజ్‌లో పెట్టకూ

టమాటాలను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల రుచిని కోల్పోవడమే కాక, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీటిని కూడా బయటే నిల్వ చేయాలి.

ఆలివ్‌ ఆయిల్‌ను కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఇలా చేస్తే హానికారక క్రిములు అందులో చేరుతాయి.

కనుక దీన్ని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది.