శరీరానికి అవసరమైన ఇనుము పుష్కళంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
పాలకూరలో విటమిన్లు, మినరల్స్, ఫైటో న్యూట్రియెంట్లు, ఐరన్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి.
పాలకూరలో ఉండే పోషకాలు అతినీలలోహిత కిరణాల నుంచి మనకు రక్షణను అందిస్తాయి. అందువల్ల చర్మ క్యాన్సర్ రాకుండా ఉంటుంది.
ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
పాలకూరలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది.
పాలకూరలో ఉండే ఫైబర్ అధిక బరువును తగ్గించడంలో సహాయ పడుతుంది.
మలబద్దకం ఉండదు. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది.
పాలకూరలో లుటీన్, జియాంతిన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
వయస్సు మీద పడడం వల్ల వచ్చే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ.