తెలుగు ఇండస్ట్రీలో నటి, నిర్మాత, హోస్ట్ గా మంచు లక్ష్మీ ప్రసన్న తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది.

మంచు మోహన్ బాబు నట వారసురాలిగా ‘అనగనగా ధీరుడు’మూవీతో ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి ప్రస్తుతం పలు చిత్రాల్లో నటించడమే కాదు.. నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

టీసీ కండ్లెర్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ప్రకటించే 100 మోస్ట్ బ్యూటీఫుల్ ఫేసెస్ గ్లోబల్ లిస్టులో, 2022లో భాగంగా మంచులక్ష్మి ఎంపికయ్యారు.

విషయాన్ని స్వయంగా మంచులక్ష్మి తన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. వివరాల్లోకి వెళితే..

100 మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ లిస్ట్ టీసీ క్యాండ్లర్, ది ఇండిపెండెంట్ క్రిటిక్స్ ద్వారా 1990 నుండి ఏటా విడుదల చేస్తుంది.

నటీనటులకు, టీవీ ప్రముఖులు, ఇంటర్నెట్ సంచలనాలు, K-పాప్ కళాకారులు మొదలైన 40 దేశాలకు పైగా ఈ జాబితా విభిన్నంగా ఉంటుంది.

‘భారతదేశపు టాప్ 100 అందమైన ముఖాలలో ఒకరిగా నన్ను నామినేట్ చేసినందుకు పాట్రియోన్‌కు ధన్యవాదాలు.

భారత దేశం తరుపు నుంచి ప్రాతినిధ్యం వహించడం నాకు ఎంతో గౌరవంగా ఉంది. 

నా తోటివారిలో నామినేట్ కావడం ఆనందంగా ఉంది’ అంటూ మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న మంచు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఫ్యాన్స్ ఆమెకు అభినందనలు చెబుతున్నారు.

సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మీకి కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు చేస్తున్నారు. మంచు లక్ష్మికి సొంతంగా ఓ యూట్యూబ్‌ చానల్‌ ఉంది.

యూట్యూబ్‌ వేదికగా తరచూ హోంటూర్స్‌, ఇంట్లో సెలబ్రెషన్స్‌కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.

ప్రస్తుతం లక్ష్మి మంచు అగ్ని నక్షత్రం అనే సినిమాలో నటిస్తూ నిర్మిస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.