గర్భధారణ సమయంలో పొట్ట మీద చర్మం సాగుతుంది. డెలివరీ తర్వాత సాధారణ స్థితిలోకి వచ్చే సమయంలో ఈ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి.
అలానే లావుగా ఉండి బరువు తగ్గి.. సన్నబడ్డప్పుడు కూడా చర్మంపై చారలు ఏర్పడతాయి.
వీటిని తొలగించుకోవడానికి మీ కోసం ఓ చక్కని చిట్కాను ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రెచ్ మార్క్స్ తొలగించుకోవాలంటే ప్రధానంగా కావాల్సిన పదర్థాలు రెండు. 1 ఏదో ఒక బేబీ ఆయిల్ 2. విక్స్ వెపోరబ్
ఒక గిన్నె తీసుకుని.. దానిలో తొలుత అర టీ స్పూన్ విక్స్ వేయాలి.
ఆ తర్వాత దీనికి రెండు టేబుల్ స్పూన్ల బేబీ ఆయిల్ వేసి.. రెండు మిక్స్ అయ్యేలా బాగా కలపుకోవాలి.
తర్వాత ఈ మిశ్రమాన్నికొద్దిగా చేతిలోకి తీసుకుని.. శరీరంలో ఏ చోట అయితే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో అక్కడ వృత్తాకారంలో రాయాలి.
మిశ్రమం పూర్తిగా శరీరంలోకి ఇంకేంత వరకూ రాస్తూనే ఉండాలి.
మర్దన పూర్తయిన 40 తర్వాత స్నానం చేయాలి.
ఈ చిట్కాను క్రమం తప్పకుండా ప్రతి రోజు పాటించడం వల్ల చర్మం మీద స్ట్రెచ్ మార్క్స్ తొందరగా పోతాయి.
మిశ్రమం తయారీలో భాగంగా బేబీ ఆయిల్ బదులు కొబ్బరి, ఆల్మండ్, ఆలీవ్ ఇలా ఏదో ఒక నూనెను వాడొచ్చు.
ఈ చిట్కాను పాటించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే చర్మంపై ఉండే చారలను తొలగించుకోవచ్చు అంటేన్నారు నిపుణులు.