షుగర్(మధుమేహం) అనేది ఎంత పెద్ద సమస్యో అందరికీ తెలిసిందే.

షుగర్ వస్తే ఆరోగ్యం పరంగా ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

అంతేకాకుండా షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో ఉండాలి. కాస్త పెరిగినా ఎంతో నష్టం వాటిల్లుతుంది.

అయితే అలాంటి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడంలో మందార పూలు ఎంతోగానో దోహదపడతాయని ఆయుర్వేదం చెబుతోంది.

ఆయుర్వేదంలో షుగర్ తగ్గించడానికి ఎన్నో మూలికలు వాడతారు. వాటిలో మందార పువ్వు కూడా ఒకటి.

షుగర్ ఉన్న వాళ్లే కాకుండా, షుగర్ లేనివాళ్లు కూడా ఈ మందార పూలను ఉపయోగించవచ్చు.

ఉదయాన్నే పరగడుపున 4 మందార మొగ్గలు తినడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉండే అవకాశం ఉంది.

ఈ మందారంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుంది.

శరీరంలో ఉండే కొవ్వు కరిగేందుకు ఇవి ఉపయోగపడటం వల్ల.. బరువు కూడా తగ్గుతారు.

జుట్టు, చర్మ సమస్యలను తొలగించడానికి కూడా ఈ మందార పూలు ఎంతో ఉపయోగపడతాయి.

అయితే వాటిని నేరుగా కాకుండా పొడిలా చేసుకుని తీసుకోవాలి.

మందార పూలలోని తేమ పోయేలా ముందు వాటిని ఎండబెట్టాలి.

ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

ఈ పొడిని నేరుగా తీసుకోవచ్చు లేదా టీ రూపంలో కూడా చేసుకుని తాగచ్చు.

మందార పూలనే కాదు ఆకులను అయితే నేరుగా నమిలి తినేయవచ్చు.

ఇలా నిత్యం చేయడం వల్ల షుగుర్ లెవల్స్ అదుపులో ఉంటాయని చెబుతున్నారు.