ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న పనికి అలసటకు గురవుతున్నారు జనాలు

అందుకు కారణం శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటమే అని వైద్యులు చెబుతున్నారు

వెల్లుల్లి గురించి అందరికి తెలుసు.. త‌రుచూ వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటారు

రోజూ ప‌ర‌గ‌డుపున ఒక వెల్లుల్లి రెబ్బ‌ను తింటే ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చట

వెల్లుల్లి ఘాటైన రుచి, వాస‌న‌ క‌లిగి ఉంటుంది. కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున వెల్లుల్లి తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటో చూద్దాం

వెల్లుల్లి నేరుగా తిన‌లేరు. కాబట్టి.. దానికి తేనెను క‌లిపి తిన‌డం బెటర్ అని నిపుణుల సలహా

రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున‌ వెల్లుల్లి, తేనె క‌లిపి తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది

రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను పేస్ట్ చేసి, ఆ మిశ్ర‌మానికి రెండు టీ స్పూన్ల తేనె క‌లిపి వారం రోజుల పాటు తీసుకోవాలి.

ఇలా చేయడం వ‌ల్ల ర‌క్త నాళాల‌లో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌కుండా ఉంటుంది

ఈ మిశ్ర‌మాన్ని ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల గొంతు నొప్పి, గొంతులో ఇన్ ఫెక్ష‌న్ త‌గ్గుతాయి. 

శ‌రీరంలో వాపులు, నొప్ప‌లు కూడా తగ్గిపోయి జీర్ణశ‌క్తి మెరుగుప‌డుతుంది

వెల్లుల్లిని, తేనెను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల జ‌లుబు, ఫ్లూల బారిన ప‌డ‌కుండా ఉండవచ్చు

అధిక ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉండటమే కాకుండా శ‌రీరంలో కొవ్వు స్థాయి కరిగే అవకాశం ఉందని వైద్యుల సూచన