ఆయా ఆహారాల వల్ల కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. సమయానుకూలంగా వాటిని ఆహారంలో భాగం చేసుకునేవారు.
ఉలవలు అనగానే దానితో కాచే చారు, కారం పొడి, గుగ్గిళ్లు గుర్తుకు వస్తాయి.
ఇక ఉలవలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
ముఖ్యంగా అధిక బరువుతో బాధపడేవారు పరిగడుపున ఉడికించిన ఉలవలు తీసుకోవడం వల్ల కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
వీటిని తరచుగా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.
స్త్రీలలో వచ్చే వైట్ బ్లీడింగ్ (తెల్ల బట్ట) వంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఉలవలు తీసుకోవడం ఉత్తమ మార్గం అంటున్నారు నిపుణులు.
ఎదిగే పిల్లలకు ఉలువలు ఎంతో విలువైన ఆహారంగా చెప్పవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల నీరసం, రక్త హీనత బయట పడవచ్చు.
తరచుగా ఉలవ చారును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల.. పక్షవాతం, నడుము నొప్పి, సయాటికా, కీళ్ల నొప్పుల వంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది అంటున్నారు నిపుణులు.
జ్వరంతో బాధపడేవారు ఉలవల కషాయాన్ని పెసరపప్పుతో కలిపి తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.
ఉలవలను వేయించి.. వస్త్రంలో పోసి.. వాపులు, నొప్పులు ఉన్న చోట పెట్టి కాపడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
ప్రతి రోజు 100 గ్రాముల ఉలవలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పోషకాల లోపం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి.
ఉలవలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది అంటున్నారు నిపుణులు.
ఉలవల కషాయాన్ని పాలల్లో కలుపుకుని తాగడం వల్ల నులి పురుగులు నశిస్తాయి.