నిమ్మకాయలు మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి  ముఖ్యంగా నిమ్మకాయ రసాన్ని సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు

నిమ్మరసంలో ఉండే 'విటమిన్ C' మన చర్మాన్ని సంరక్షిస్తుంది అలాగే నిమ్మరసం శరీరంలో రోగ నిరోధకశక్తిని కూడా పెంచుతుంది

అయితే నిమ్మరసం తీసుకొని చాలామంది తొక్కలను పడేస్తుంటారు నిమ్మకాయల వల్ల ఎన్ని లాభాలున్నాయో, వాటి తొక్కలు కూడా అంతే మేలు చేస్తాయి

నిమ్మతొక్కల తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు వైద్య నిపుణులు

నిమ్మతొక్కను నేరుగా తినలేని వారు దాన్ని ఎండబెట్టి పొడిచేసి తీసుకోవచ్చు

ఎందుకంటే రసం కంటే తొక్కలోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు

ఇందులో విటమిన్లు ఎ, సి, డి-లైమోనీన్ లతో పాటు బీటా కెరోటిన్, సిట్రిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, హెస్పెరిడిన్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అలాగే నిమ్మతొక్కల్లో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటాయి.

నిమ్మతొక్కల్లో ఉండే పొటాషియం హైబీపీని కంట్రోల్ చేస్తుంది శరీరంలో రక్తసరఫరాను మెరుగుపరచి గుండె జబ్బులను దూరం చేస్తుంది

నిమ్మతొక్కలలో ఉండే డి-లైమోనీన్ వల్లే నిమ్మకాయలు వాసనను కలిగి ఉంటాయి

ఈ డి-లైమోనీన్ క్యాన్సర్ కణాలు నాశనం చేస్తుందని, అలాగే డయాబెటిస్ ని కూడా దూరం చేస్తుందని చెబుతున్నారు

నిమ్మతొక్కల్లో ఉండే విటమిన్ సి శరీరంలో యాంటీ బాడీలను ఉత్పత్తి చేసి తెల్ల రక్తకణాల సంఖ్య పెంచుతుంది

నిమ్మతొక్కలు కాస్త చేదుగా ఉంటాయి.. వాటిని పొడి లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు

కనుక నిమ్మ తొక్కలను పడేయకుండా వాటి లాభాలను పొందాలని నిపుణులు సూచిస్తున్నారు