మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ‘కార్తికేయ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కార్తికేయ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అదే జానర్, అదే పేరుతో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
కార్తికేయ తర్వాత నిఖిల్ – దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ 2 మూవీ.. ట్రైలర్, సాంగ్స్ ఇలా అన్నీ విషయాలలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా.. సాక్ష్యాత్తు శ్రీకృష్ణుడు పుట్టిపెరిగిన ద్వారక నేపథ్యంలో ఉండబోతుందని ఇప్పటికే ప్రమోషన్స్ లో, ట్రైలర్ లో చెప్పేశారు.
కథ:
డాక్టర్ కార్తికేయ(నిఖిల్) సైన్స్ ని నమ్ముతాడు కానీ.. దేవుడిని నమ్మడు. ఎప్పుడూ తెలియని విషయాలను తెలుసుకోవడానికి, వాటిని చేధించేందుకు ట్రై చేస్తుంటాడు.
అలాంటి కార్తికేయ ఓ మొక్కు కారణంగా తన తల్లితో కలిసి ద్వారకాకు వెళ్తాడు. అక్కడినుండి కార్తికేయ లైఫ్ లో ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి.
ఈ క్రమంలో కార్తికేయకి ముగ్ధ(అనుపమ) పరిచయం అవుతుంది. ఆ తర్వాత విధి తనకు ముందే ఓ గమ్యాన్ని డిసైడ్ చేసిందని తెలుసుకుని దాన్ని సాధించే పనిలో పడతాడు.
మరి దేవుడిని నమ్మని కార్తికేయ ద్వారకాకి ఎందుకు వెళ్లాడు? కార్తికేయ లైఫ్ లో శ్రీకృష్ణుడి ప్రస్తావన ఎందుకొచ్చింది?
మరి దేవుడిని నమ్మని కార్తికేయ ద్వారకాకి ఎందుకు వెళ్లాడు? కార్తికేయ లైఫ్ లో శ్రీకృష్ణుడి ప్రస్తావన ఎందుకొచ్చింది?
కార్తికేయకి, ద్వారకాకి సంబంధం ఏంటి? ఆ తర్వాత కార్తికేయ లైఫ్ ఎలాంటి మలుపు తిరిగింది? చివరికి కార్తికేయ ఇచ్చిన సందేశం ఏంటనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
డాక్టర్ కార్తికేయ ద్వారకా ప్రయాణం.. ఆ ప్రయాణంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు.. నేపథ్యంలో కథను సాగించారు.
విశ్లేషణ:
క సినిమా విషయానికి వస్తే.. భగవంతుడు శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకా ఎందుకు నీటమునిగింది? అనే విషయాన్నీ ప్రస్తావిస్తూ సినిమా మొదలైంది.
విశ్లేషణ:
రానున్న కలికాలంలో మానవాళి ఎలాంటి విపత్తులు ఎదుర్కోబోతుంది? మనుషుల జీవనం ఎలా ఉండబోతుంది? అనేది సాక్ష్యాత్తు శ్రీకృష్ణుడు ఉద్దవుడికి వివరిస్తాడు.
సినిమాలో ప్రతి సీన్.. ప్రతి మిస్టరీ ప్రేక్షకులను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. కార్తికేయకి రెట్టింపు సస్పెన్స్ ఎలిమెంట్స్, కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్..
దాదాపు రెండున్నర గంటల వరకూ థియేటర్లో ప్రేక్షకులు పిన్ డ్రాప్ సైలెన్స్ తో సినిమాను ఎంజాయ్ చేశారు.
కార్తికేయ పాత్రలో నిఖిల్ మరోసారి మెప్పించాడు. అలాగే కార్తికేయ ప్రయాణాన్ని పర్ఫెక్ట్ గా పిక్చరైజ్ చేశాడు సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టంనేని.
దిగాక ఈ సినిమాకు ఎడిటర్ కూడా కార్తీకే కావడం విశేషం. హీరోయిన్ అనుపమతో పాటు కమెడియన్ శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష ఆకట్టుకున్నారు
శ్రీకృష్ణుడి రహస్యాలను చేధించే ఎవరినైనా అడ్డుపడి చంపే విలన్ శంతనుగా ఆదిత్య మీనన్.. స్పెషల్ క్యామియో రోల్ లో అనుపమ్ ఖేర్ క్యారెక్టర్స్ థ్రిల్ కి గురిచేస్తాయి.
శ్రీకృష్ణుడి రహస్యాలను చేధించే ఎవరినైనా అడ్డుపడి చంపే విలన్ శంతనుగా ఆదిత్య మీనన్.. స్పెషల్ క్యామియో రోల్ లో అనుపమ్ ఖేర్ క్యారెక్టర్స్ థ్రిల్ కి గురిచేస్తాయి.