భారతీయ వివాహ సంప్రదాయాల్లో మహిళ కాళ్లకు మెట్టెలు ధరించడం తప్పనిసరి.

పెళ్లిలో మంగళసూత్రంతోపాటు స్త్రీల కాళ్లకు మెట్టెలు కూడా పెడతారు. వీటిని కూడా సౌభాగ్య చిహ్నంగా భావిస్తారు. 

తనను తల్లిగా భావించాలని, తనతో మర్యాదగా ఉండాలని స్త్రీ కాలి మెట్టెలు సూచిస్తాయి. 

వివాహిత స్త్రీలు కాలి మెట్టెలు పెట్టుకోవడం వెనక సంప్రాదాయమే కాక సైన్స్ కూడా దాగి ఉంది.

చాలామంది మెట్టెలను అందం కోసం మాత్రమే పెట్టుకుంటారని భావిస్తూ ఉంటారు. కానీ దాని వెనుక ఉన్న ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. 

వివాహిత స్త్రీ కాలి రెండో వేలుకు మెట్టెలను ధరిస్తారు. అన్ని వేళ్లను వదిలేసి రెండో వేలుకు మాత్రమే ఎందుకు పెట్టుకోవాలి.. అన్న సందేహం కూడా చాలా మంది కలుగుతుంది. 

బొటన వేలు పక్కన ఉండే రెండో వేలు స్త్రీలకు ఆయువు పట్టు వంటిది. ఆ వేలు నుండి మన శరీరానికి ఎల్లప్పుడూ విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. 

అందుకే ఆ వేలు నేరుగా నేలకు తగలకుండా ఉండడానికి మెట్టెలు ధరించే సంప్రదాయం ప్రారంభమైందని అంటున్నారు.

ఇక నాడీ శాస్త్రం ప్రకారం చూసుకున్నా.. కాలి రెండవ వేలుకు, స్త్రీల గర్భాశయానికి, గుండెకు నిర్దిష్టమైన నాడుల కలయిక ఉంటుందట.

కాలి రెండవ వేలుకు మెట్టెలు పెట్టుకోవడం వల్ల ఆ వేలు మీద ఒత్తిడి పడుతుంది.  దీంతో గర్భాశయ సంబంధిత సమస్యలు రాకుండా ఉండి సంతానం కలగడానికి సులభమవుతుంది అంటున్నారు. 

అలానే కాలి వేలుకు వెండితో చేసిన మెట్టెలను మాత్రమే ధరించాలి. ఇతర లోహాలతో చేసిన వాటిని ధరించరాదు.

ఎందుకంటే వెండి శరీర ఉష్ణోగ్రతను సమానంగా ఉంచుతుంది. 

పైన చెప్పిన కారణాల వల్ల వివాహిత స్త్రీలు మెట్టెలు తప్పక ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.