మ‌నం తిన్న భోజ‌నం వంటికి ప‌ట్టాల‌న్నా, మ‌న‌కు శాంతి చేకూరాల‌న్నా ఒక ప‌ద్ద‌తిలో భోజ‌నం చేయాలి.

భోజ‌నాన్ని తిన్న త‌రువాత, తిన‌డానికి ముందు కాళ్లు, చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోవాలి.

తూర్పు లేదా ఉత్త‌రం వైపు కూర్చొని భోజ‌నం చేయాలి.

ఆహార ప‌దార్థాల‌ను వ‌డ్డించేట‌ప్పుడు కొద్దిగా ఎత్తు నుండి వ‌డ్డించాలి. 

ఎడ‌మ చేత్తో తినే కంచాన్ని ముట్టుకోరాదు. 

ఎంగిలి చేత్తో ఏ ప‌దార్థాన్ని చూపించ‌కూడ‌దు. తాకరాదు.

అర‌టి ఆకుల‌లో భోజ‌నం చేయ‌డం చాలా ఉత్త‌మ‌మైన ప‌ని.

భోజ‌నం చేసిన త‌రువాత వెంట్రుక‌ల‌ను క‌త్తిరించ‌కూడ‌దు. ఎవ‌రైనా అతిథులు వ‌చ్చిన‌ప్పుడు మ‌నం తిన‌గా మిగిలిన అన్నాన్ని వారికి వ‌డ్డించ‌కూడ‌దు.

 ఒక‌సారి వండిన ప‌దార్థాల‌ను మ‌రోసారి వేడి చేసి తిన‌కూడ‌దు.

స్త్రీలు చేతుల‌కు గాజులు లేకుండా భోజనాన్ని తిన‌కూడ‌దు.

భోజ‌నం చేసిన త‌రువాత నోట్లో నీటిని పోసుకుని పుక్కిలించాలి.

చాలా మంది మంచం మీద కూర్చొని భోజ‌నం చేస్తూ ఉంటారు. ఇలా తిన‌డం వ‌ల్ల మ‌నం తిన్న తిండి మ‌న వంటికి ప‌ట్ట‌ద‌ని మంచం కోళ్ల‌కు ప‌డుతుంద‌ని పెద్దల మాట.

 చొట్ట‌లు ప‌డిన కంచంలో, ప‌గిలిన కంచంలో భోజ‌నం చేయ‌కూడ‌దు.

 నిల‌బ‌డి భోజ‌నాన్ని అస్స‌లు చేయ‌కూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల ద‌రిద్రులుగా మార‌తార‌ని శాస్త్రాలు చెబుతున్నాయి.

భోజ‌నం తినేట‌ప్పుడు మ‌ధ్య‌లో నుండి అస్స‌లు లేవ‌రాదు. కోపంతో భోజ‌నాన్ని అస్స‌లు త‌యారు చేయ‌కూడ‌దు.