మాంసాహార ప్రియులకు ఇష్టమైన వాటిల్లో చికెన్ ఒకటి. ఆదివారం వచ్చిందంటే ఇంట్లో కోడి కూర ఉండాల్సిందే.
చికెన్ ని మితంగా తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు.
తరచూ నూనెలో బాగా వేయించిన చికెన్ ను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
చికెన్ ను అతిగా తినడం వల్ల అజీర్తి సమస్య వచ్చే అవకాశం ఉంది.
చికెన్ ఎక్కువగా తినడం వలన శరీరంలో వేడి చేసే అవకాశం కూడా ఉంటుంది.
చికెన్ తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మాత్రమే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.