నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాల్లో కీరా దోస కూడా ఒకటి.

కీరా ని సలాడ్స్ లో, ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా తింటున్నారు

కీరదోసకాయ కిడ్నీని శుభ్రపరచడంలో, టాక్సిన్స్ ను బయటకు ఫ్లష్ అవుట్ చేయడంలో బాగా పనిచేస్తుంది.

కీరదోసకాయను రెగ్యులర్ గా తినడం వల్ల ఎక్సెస్ యూరిక్ యాసిడ్ ను బాడీ నుండి తొలగిస్తుంది, దాంతో కిడ్నీ స్టోన్స్ ఏర్పడవు.

కీరదోసకాయలో క్యాన్సర్ తో పోరాడే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఫాలీఫినాల్స్, ఫైటోన్యూట్రీయంట్స్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి.

రెండు గ్లాసులు కీరదోస జ్యూస్ తాగితే..  స్టొమక్ అల్సర్ నివారిస్తుంది. పొట్టకు చల్లదనం అందిస్తుంది. 

కీరదోసకాయలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియంలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

ప్రతిరోజూ  ఫ్రెష్ కీరదోసకాయను తినడం మంచిది. హైడ్రేషన్ మాత్రమే కాదు, ఆకలి తగ్గిస్తుంది. 

కీర దోసకాయ తింటే.. హ్యాంగోవర్ తలనొప్పి కూడా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

నిద్రపోయేముందు కీరదోసకాయను గుండ్రంగా కట్ చేసుకొని కళ్లపై పెట్టుకుంటే కళ్ల కింద నల్లని వలయాలు, వాపులు తగ్గుతాయి.

దంతాల ఆరోగ్యానికి, చిగుళ్ళ నుండి రక్తం కారుట, దంత క్షయం వంటి సమస్యలు ఉన్నవారికి  దోసకాయ రసం చాలా సహాయపడుతుంది.

పూతల వంటి పలు జీర్ణ అల్సర్లకు కీర దోసకాయ మంచి విరుగుడుగా పనిచేస్తుంది.