కిడ్నీలో రాళ్లు ఉండటం అనేది చాలా పెద్ద సమస్య.

కొన్నిసార్లు వాటిని తొలగించేందుకు సర్జరీలు కూడా చేయాల్సి వస్తుంది.

కిడ్నీలో రాళ్ల ద్వారా వచ్చే బాధ వర్ణనాతీతంగా ఉంటుంది.

వీళ్లు తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. కొన్నిసార్లు రాళ్లు యురిన్ ద్వారా పడిపోతూ ఉంటాయి.

అయితే కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్లు ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలో చూద్దాం.

కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు జంక్ ఫుడ్ దూరంగా ఉండాలి.

జంక్ ఫుడ్లోనూ ముఖ్యంగా చైనీస్, మెక్సికన్ ఆహారానికి దూరంగా ఉండాలి.

జంక్ ఫుడ్మాత్రమే కాదు.. నాన్వెజ్ ఆహారాన్ని కూడా సాధ్యమైనంత వరకు తగ్గించి తీసుకోవాలి.

మాంసాహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయని తెలిసిందే.

నాన్ వెజ్ ఎక్కువగా తింటే.. శరీరంలో ప్రొటీన్లు ఎక్కువగా చేరతాయి.

అధిక శాతంలో ప్రొటీన్లు తీసుకుంటే అవి కిడ్నీలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు చాక్లెట్లను తక్కువగా తినాలి.

ఎందుకంటే చాక్లెట్లలో ఆగ్జలేట్స్ అధికంగా ఉంటాయి. అవి కిడ్నీలో స్టోన్స్ రావడానికి కారణం అవుతాయంటారు.

చాక్లెట్లు మాత్రమే కాదు.. పాలకూర, టమాటాలు వంటి వాటిలోనూ ఆగ్జలైట్స్ అధికంగా ఉంటాయి.

అందుకే కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు పాలకూర, టమాటాలు, తృణ ధాన్యాలకు దూరంగా ఉండాలని చెబుతారు.