మనం రోజు తినే ఆహారంలో వేరు శనగలు తప్పకుండా ఉంటాయి.

కొంత కాలం క్రితం వరకు వేరుశనగ నూనేను ఎక్కువగా వినియోగించేవారు.

ఇక పోపులు, చట్నీలు, కాలక్షేపం కోసం ఇలా పల్లీలను నిత్యం ఏదో రకంగా తింటూనే ఉంటాం.

పల్లీలల్లో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల మాంసకృత్తులు, పీచు పదార్థాలు, పిండి పదార్థాలు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

వేరు శనగలో మన ఆరోగ్యానికి పనికి వచ్చే దాదాపు 13 రకాల విటమిన్స్‌, 26 రకాల ఖనిజాలు లభిస్తాయి.

ఇక రక్తహీనతతో బాధపడేవారు.. పల్లీలను వేయించి.. బెల్లంతో కలిపి తినడం వల్ల వికారం కలగకుండ ఉండటమే కాక.. రక్త వృద్ధి కూడా కలుగుతుంది.

తరచుగా పల్లీలను తీసుకోవడం వల్ల మనం చురుకుగా ఉండటమే కాక.. మెదడు పని తీరు కూడా మెరుగుపడుతుంది.

ఎదిగే పిల్లలకు వీటిని తరచుగా ఇవ్వడం వల్ల.. మెదడు చురుకుగా పని చేసి.. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

పల్లీలను తరచుగా తీసుకోవడం వల్ల.. రోగ నిరోధక శక్తి పెరిగి తరచుగా జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చు. 

ఎముకలు బలంగా, ధృడంగా ఉండటానికి పల్లీలు ఎంతో ఉపయోగపడతాయి. 

వీటిల్లో ఫైబర్‌ పుష్కలంగా ఉండటం వల్ల ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేయడమే కాక.. అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

పల్లీల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచుగా తినడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చర్మంపై ముడతలను తొలగించడంలో కూడా సహాయం చేస్తాయి.

అయితే కొందరికి పల్లీలు పడవు. తింటే ఎలర్జీ వస్తుంది. కాబట్టి వారు దూరంగా ఉండటం మేలు.

ఆస్తామాతో బాధపడేవారు కూడా పల్లీలను తక్కువ మోతాదులో తీసుకోవాలి.

అలానే వేయించిన పల్లీల్లో కన్నా.. ఉడకబెట్టిన పల్లీల్లో పోషకాలు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పల్లీలను తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.