తప్పు జరిగింది సారీ అంటే.. పర్వాలేదు ముందు భోజనం చేయండి అని నవ్వుతూ చెప్పాడు.  అంత అమాయకత్వాన్ని చంపేసి తర్వాత జీవితాంతం రిగ్రెట్ అవ్వడం కంటే పనిష్మెంట్ అయినా పర్వాలేదు.

సారీ చెప్పే ధైర్యం లేని వాళ్ళకి తప్పు చేసే అర్హత లేదు. నీ తప్పేంటో తెలుసుకుని నువ్వు సారీ చెప్పాలి

నీ దేశాన్ని నువ్వు ప్రేమించడం తప్పు కాదు. కానీ పక్క దేశాన్ని ద్వేషించడం తప్పే.

ఓ సైనికుడు శతృవుకి అప్పగించిన యుద్ధం. ఈ యుద్ధంలో సీతారాముల్ని నువ్వే గెలిపించాలి.

ఇది మీ తాత అడిగిన సాయం కాదు. నువ్వు తీర్చాల్సిన రుణం.

ఆ ఉత్తరం సీతకి చేర్చడం మీ తాత ఆఖరి కోరికే కాదు.. 20 ఏళ్ళ ఓటమి కూడా..

జెలస్ కాకపోవడానికి వీడేమన్నా నిజంగా విష్ణుమూర్తా.. విష్ణు శర్మ అంతే..

నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే.. కాశ్మీర్‌ని మంచుకి వదిలేసి వస్తారా?

ఇక్కడ గదిలో చలి పెరుగుతుంది. కాశ్మీర్ నుండి నువ్వే పంపుతున్నావా.. ఈ ఋతువులు కూడా నీలాగే వచ్చి నాతో ఉండకుండా వెళ్ళిపోతున్నాయి.

కురుక్షేత్రంలో రావణ సంహారం.. యుద్ధపు వెలుగులో  సీతా స్వయంవరం.

అజ్ఞానం, అమాయకత్వం కలగలిపిన జాతిరత్నం మీరు.

ఆపదలు, ఆ బాధలు చెప్పి రావు.. చెప్పకుండానే వస్తాయి.

అడుగు దూరంలో ఆపద ఉంటే.. భయమేయకుండా ఉంటుందా?

గెలుపు అని చెప్పుకోలేని బాధ. ఓటమిని ఒప్పుకోలేని బాధ్యత.

నేను అనాధని కాదు, నాకేమైనా అయితే ఏడ్చేవాళ్ళు ఒకరున్నారు.

వాడు నిజంగా తప్పు చేసాడో లేదో తెలీదు గానీ బరువు మాత్రం సీత మోసింది.

ఇక చీకట్లో ఉన్నది చాలు. నా మేనకోడలు కస్తూరిపైన వెలుగు పడాలి.

నీ దేశం నిన్ను అనాధని చేసిందని కోపంగా ఉన్నావా? నేను పుట్టక ముందే అనాధని రా, కానీ ఎప్పుడూ అమ్మ మీద కోపం రాలేదు.

కనిపిస్తుంది.. ఈ లెటర్ చదువుతున్నప్పుడు దీన్ని తడిపే నీకళ్ళు.. వినిపిస్తుంది.. నన్ను పిలిచే నీ అరుపు ఈ జైలులో నా ఏకాంతంని కప్పేస్తుంది.

ఆయుధంతో యుద్దం చేసేవాడు సైనికుడు. ధర్మం కోసం యుద్ధం చేసేవాడు రాముడు.