బీరకాయలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ , ఫైబర్  ఉంటాయి. నీరు కూడా ఎక్కువగా ఉంటుంది.

బీరకాయలో విటమిన్ ఎ, సి, ఐరన్, మెగ్నిషియం, విటమిన్ బి6 సమృద్ధిగా ఉంటుంది.

బీరకాయలో శరీరానికి కావాల్సిన పేప్టిడ్స్, ఆల్కలాయిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల శరీర రక్షణ వ్యవస్థ బలంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.

బీరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆల్కలాయిడ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. దీంతో శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి.

ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న కాలేయ  రక్షణకు బీరకాయ ఉపయోగపడుతుంది.

అల్సర్లు, కడుపులో మంటలతో బాధపడే వాళ్లకి బీరకాయ మంచి మందులా పని చేస్తుంది

బీరకాయలు రక్తశుద్ధికీ, కాలేయ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతాయి. 

బీరకాయల్లో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాల వల్ల కీళ్ల నొప్పులు, ఇతర నొప్పులు సమస్యలు తగ్గుతాయి.

బీరకాయలోని మాంగనీసు జీర్ణక్రియా ఎంజైముల ఉత్పత్తిని పెంచడంద్వారా చక్కెరవ్యాధినీ నియంత్రిస్తుంది.

రోజూ ఉదయాన్నే పరగడుపునే కప్పు బీరకాయ జ్యూస్ తాగుతుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. 

బీరకాయలోని విటమిన్-ఎ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని తాజా పరిశోధనలో తేలింది.

బీరకాయ తీసుకోవడం ద్వారా వయస్సు మీద పడ్డాక కూడా కంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. కళ్లలో శుక్లాలు రావు. 

బీరకాయల్లోని విటమిన్ బి6 ఎనీమియాను నివారిస్తుంది.

అధిక బరువు తగ్గాలనుకునే వారికి బీరకాయ చాలా ఉపయోగపడుతుంది. ఇది శరీర మెటబాలిజంను మెరుగు పరుస్తుంది.

కాబట్టి ఇంతలా ఆరోగ్యానికి ఉపయోగపడే బీరకాయలను మన డైట్ లో తప్పక చేర్చుకోవాలి.