నందమూరి కళ్యాణ్ రామ్, స్వాతిలది పెద్దలు కుదిర్చిన పెళ్ళి.
2006లో వీరి వివాహం జరిగింది.
వీరు చాలా అన్యోన్యంగా ఉంటారు.
లో-ప్రొఫైల్ మెయిన్టెయిన్ చేస్తుంటారు.
ఇటీవలే కళ్యాణ్ రామ్, భార్య స్వాతితో తిరుమల వెళ్ళారు.
స్వాతి విషయానికి వస్తే.. ఆమె ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి.
స్వాతి తండ్రికి పలు కంపెనీలతోపాటు ఎన్నో బిజినెస్లు ఉన్నాయట.
స్వాతి పెళ్లికి ముందు వైద్యురాలిగా పనిచేశారు.
పెళ్లయిన తర్వాత కుటుంబ బాధ్యతల నేపథ్యంలో వైద్య వృత్తిని వదిలేశారు.
ఆ తర్వాత పూర్తిగా కుటుంబానికే పరిమితమయ్యారు.
వీరికి ఓ పాప, బాబు ఉన్నారు.
తారక అద్వైత , శౌర్యరామ పిల్లల పేర్లు.
ఇక, పిల్లలు పెద్దవాళ్లు కావడంతో స్వాతి కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
కళ్యాణ్ రామ్ సహాయంతో ఓ వీఎఫ్ఎక్స్ సంస్థను స్థాపించారు.