భూమిపై అత్యంత ప్రజాదరణ పొందిన, రుచికరమైన, పోషకమైన పండ్లలో యాపిల్స్  ఒకటి.  యాపిల్స్ లో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి.

యాపిల్స్‌లో విటమిన్ ఎ, సి, కె పుష్కలంగా ఉన్నాయి. వాటిలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. ఆపిల్ లో తక్కువ కెలోరీలు, ఫైబర్ కూడా మంచి మోతాదులో ఉండటం వల్ల బరువు తగ్గడానికి దోహద పడుతుంది

ఆపిల్ మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా సహాయ పడుతుంది. 

ఈ  పండు కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది.గుండె పోటు రాకుండా కాపాడుతుంది.

మెదడు కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మరింత ప్రకాశవంతంగా చేస్తుంది.

ఈ పండు రోజు  తినడం  వల్ల దంతాలు, ఎముక మరియు జుట్టును ఆరోగ్యంగా కూడా  ఉంచుతుంది.

ఈ పండు బీపీ, డయాబెటీస్ ని సైతం చక్కగా  నియంత్రిస్తుంది.

ఆపిల్ తింటే శరీరంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో మంచి పాత్ర నిర్వహిస్తుంది.

ఆపిల్ పండు తినడం ద్వారా ఆస్థమా తీవ్రతను కూడా తగ్గించుకోవచ్చు.

ఆపిల్ లో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ శరీరంలో జీర్ణ సమస్యలను నివారించడంలో దోహదపడుతుంది.

ఆపిల్ పండు తినడం వల్ల ధూమపానం మానేసిన వ్యక్తులలో ఊపిరితిత్తుల పనితీరును పునరుద్ధరిస్తుందని సూచిస్తుంది.