కొబ్బరి కాయ రూపంలో కొబ్బరి చెట్ల నుండి లభిస్తుంది. హిందువులు ఎక్కువగా పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తుంటారు. అలాగే ప్రారంభోత్సవాలకు ఉపయోగిస్తుంటారు.
పచ్చి కొబ్బరిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి డయాబెటిస్ ను తగ్గించడానికి పనిచేస్తాయి.
పచ్చి కొబ్బరిలో అధిక మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ను నిరోధించడానికి సహాయపడుతుంది.
కొబ్బరిలో అధిక మొత్తంలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.