జీలకర్ర లేని ఇల్లు ఉండదేమో.. కూరల్లో రుచి పెంచడానికి వేసే మసాలా దినుసుల్లో ఇది ముఖ్యమైనది.

కేవలం వంట కి మాత్రమే కాదు.. రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ జీలకర్ర ముందుటుంది.

జీలకర్ర లో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం వంటివన్నీ ఉంటాయి.

జీలకర్ర వేసిన నీళ్లు  తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. అవేంటో ఇప్పుడు  తెలుసుకుందాం.

వ్యాయామం చేస్తే తగ్గే కొవ్వు కంటే జీలకర్రని నీళ్లు ఉపయోగించడం వల్ల కరిగే కొవ్వు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందట.

జీలకర్ర బరువు తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. 

గర్భం ధరించినప్పుడు సమస్యలు రాకుండా చూడడంతో పాటు ప్రసవం తర్వాత బరువు తగ్గేందుకు జీలకర్ర ఎంతగానో తోడ్పడుతుంది

జీలకర్రను రోజూ తీసుకోవడం వల్ల తల్లి పాల ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

ఒకవేళ మనకు జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్లలేని పరిస్థితి ఉంటే జీలకర్ర వేసిన నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

ఇది మన శరీరాన్ని చల్లబరుస్తుంది. శరీరంలో వేడి బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది.

అందాన్ని పెంచేందుకు కూడా జీలకర్ర తోడ్పడుతుంది. జీలకర్రను తీసుకోవడం వలన మొటిమల సమస్య ఉండదు.

రోజూ ఉదయాన్నే పరిగడుపున జీలకర్ర నీళ్లు తాగడం, ముఖం కడుక్కోవడం చేస్తుంటే మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

డయాబెటిస్ సమస్య ఉన్నవారు రోజూ తప్పక జీలకర్రను వంటల్లో ఉపయోగించడంతో పాటు జీరా పానీ లేదా జల్ జీరా తీసుకోవాలి. 

రోజూ పరగడుపున జీలకర్ర నీళ్లు తీసుకోవడం వల్ల డయాబెటిస్ తగ్గుతుంది. 

రోజూ ఉదయాన్నే జీలకర్ర, బెల్లం కలిపి నీటిలో వేసి ఆ నీటిని తాగితే పిరియడ్స్ కూడా రెగ్యులర్ గా సమయానికి వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ సమస్యలన్నింటికీ జీలకర్ర కంటే జీలకర్ర నానబెట్టిన నీళ్లు బాగా ఉపయోగపడతాయి.