శాఖాహారం తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ.

శాఖాహారంలో అధిక శాతం ఫైబర్‌, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి.

శరీరానికి హాని కలిగించే సాచురేటెడ్ కొవ్వు తక్కువ ఉంటుంది.

దీని వల్ల బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి.

తక్కువ మోతాదులో సోడియం, కొవ్వులు, అధిక శాతం ఫైబర్, పొటాషియం ఉన్న శాఖాహారం గుండె జబ్బులను రానివ్వకుండా కాపాడుతుంది.

మాంసాహారులతో పోలిస్తే శాఖాహారులు సన్నగా ఉంటారు.

అంతేకాదు ఆరోగ్యకరమైన బీఎమ్ఐ కలిగి ఉంటారు.

మాంసాహారులతో పోలిస్తే శాఖాహారులు ఎక్కువ కాలం జీవిస్తారు.

మాంసాహారంలో ఉండే సాచురేటెడ్ కొవ్వులు రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒబెసిటీ వల్ల త్వరగా చనిపోయే ప్రమాదం ఉంది.

తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పులు వంటి వాటిలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఫైబర్‌ లేని మాంసాహారం తీసుకునేవారిలో జీర్ణక్రియ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ.

మాంసం తినని శాఖాహారులు అధిక కొవ్వు ఉండే చీస్, జంక్ ఫుడ్ వంటివి తింటే మంచిది కాదు.

శాఖాహారులైన సరే కొవ్వు పదార్థాలు తిని శారీరక శ్రమ చేయకపోతే అనారోగ్యమే.

మాంసాహారంతో పోలిస్తే శాఖాహారం మంచిదే అని నిపుణులు చెబుతున్న మాట.