చాలా మందిలో వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను వంటింటి చిట్కాలతో దూరం చేసుకోవచ్చు.

వంటింట్లో ఉండే బెల్లంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. అవెంటే చూద్దాం..

మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేసిన త‌ర్వాత చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని చ‌ప్పరిస్తే. మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది.

బెల్లాన్ని రోజూ తింటూ ఉండటం వల్ల లివర్‌లో ఉండే విష‌, వ్యర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

ద‌గ్గు, జ‌లుబు ఉన్నవారు చిన్న బెల్లం ముక్కను గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసుకుని తాగితే ఫలితం ఉంటుంది.

బెల్లాన్ని రోజూ తీసుకోవడం వల్ల ర‌క్తం శుద్ధి అవుతుంది.

బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, జింక్‌, సెలీనియం వంటి పోష‌కాలు ఉంటడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.

బెల్లం తీసుకోవడం వల్ల శ్వాస‌కోశ వ్యవ‌స్థ‌, ఊపిరితిత్తులు, పేగులు, జీర్ణాశ‌యం, ఆహార నాళం అన్నీ శుభ్రమ‌వుతాయి.

మహిళలకు నెలసరి సమయంలో వచ్చే సమస్యలను బెల్లం తగ్గించగలదు. ఆ సమయంలో ఇది మనసును, శరీరారన్ని ప్రశాంతంగా ఉంచుతుంది.

బెల్లంలో ఐర‌న్‌, ఫోలేట్‌లు ఉండటం వల్ల.. ఎర్ర ర‌క్త క‌ణాలు ఎక్కువ‌గా ఉత్పత్తి అవుతాయి.

 10 గ్రాముల బెల్లంలో 16 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఇది పేగుల‌కు బ‌లం చేకూరుస్తుంది.

శరీరాన్ని చల్లబరిచే గుణం బెల్లానికి ఉంది. అందుకే ఎండాకాలం బెల్లంతో చేసిన పానకం తాగమని చెబుతుంటారు.

శరీరాన్ని చల్లబరిచే గుణం బెల్లానికి ఉంది. అందుకే ఎండాకాలం బెల్లంతో చేసిన పానకం తాగమని చెబుతుంటారు.

ఆర్థరైటిస్‌, కీళ్ల స‌మ‌స్యలు, నొప్పులు, వాపులు ఉన్నవారు నిత్యం బెల్లం తిన‌డం వ‌ల్ల మంచి ఫలితం ఉంటుంది.

అయితే ఈ బెల్లాన్ని అతిగా తీసుకోవడం వల్ల లేని వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే మోతాదుకు మించకుండా జాగ్రత్తగా ఉండాలి.