సపోటా అనేపేరు అందరికీ తెలిసిన విషయమే. సపోటాకు మరోపేరు ‘చికూ' అందరికీ ఈ పేరు తెలియదు.

సపోటా మామిడి, అరటి, జాక్ వంటి పండ్ల విభాగానికి చెందిన ఈ పండు అధిక కాలరీలు గల రుచికరమైన పండు.

సపోటా అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకర పండ్లలో ఒకటి.

సపోటా రుచికరమైన గుజ్జు వల్ల తేలికగా జీర్ణమై, గ్లూకోస్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది.

ఈ పండులో విటమిన్లు, మినరల్స్, టన్నిన్ లు సమృద్ధిగా ఉన్నాయి. దీని రుచి తియ్యగా ఉండడం వల్ల, షేక్స్ లో బాగా ఉపయోగిస్తారు.

సపోటా విటమిన్ A ని అధికంగా కలిగి ఉంటుంది.  వృద్ధాప్యంలో కూడా క౦టి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

సపోటా శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోస్ ని సమృద్ధిగా కలిగి ఉంటుంది.

పేగు వ్యాధి, పొట్టలో పుండ్లు వంటి వ్యాధుల నివారణ ద్వారా జీర్ణ వాహిక పరిస్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

పిండిపదార్ధాలు, అవసరమైన పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండడం వల్ల గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చాలా ఉపయోగకరం.

సపోటా పండు అనేక యాంటీ-వైరల్, యాంటీ-పరాసిటిక్, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. మనవ శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి.

ఇది మొలలు, జిగట విరోచనాల నుండి ఉపశమనం పొందడానికి కూడా సహాయపడుతుంది.

సపోటా పండు శక్తివంతమైన ఉపశమనకారి కావడం వల్ల నరాల ఉద్రుతిని, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.