మనం తినే ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి అని అందరికి తెలుసు

ఈ బిజీ లైఫ్ కారణంగా ఎక్కువమంది ఫుడ్ ని నిర్లక్ష్యం చేస్తున్నారు

టైమ్ కి ఆహారం తినకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతుంటారు

హెల్తీ ఫుడ్ ఏదైనా సరే సమయానికి తీసుకోవాలని సూచిస్తుంటారు

ఆలస్యమైతే అమృతం కూడా విషం అవుతుందని పెద్దల మాట

ఆలస్యంగా తీసుకునే ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం

ఆలస్యమైంది కదా అని అతిగా కూడా తీసుకోవద్దని వైద్యుల సలహా

మరి సమయానికి ఆహారం తినకపోతే కలిగే ఆరోగ్య సమస్యలేంటో చూద్దాం

టైమ్ కి తినకపోవడం వల్ల కడుపులో గ్యాస్(ఎసిడిటీ) సమస్య పెరుగుతుంది

జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించి శరీరం పటుత్వాన్ని కోల్పోయే ప్రమాదం

మొదట్లో బాగానే ఉన్నా తర్వాత కడుపు నొప్పితో సమస్యలు మొదలవుతాయట

టైమ్ కి తినకపోవడం వలన అనోరెక్సియా వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందట

అనోరెక్సియా వ్యాధి సోకితే మనిషి 15% బరువు కోల్పోయే అవకాశం

టైమ్ కి తినకపోతే మహిళలలో ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలు రావచ్చట

లేటుగా తినడం వలన బలీమియా, బంగీ వ్యాధులు వచ్చే ప్రమాదం

ఈ వ్యాధుల వల్ల అధిక శ్రమ చేసిన ఫీలింగ్, నీరసం, వాంతులు వచ్చే అవకాశం

నాజూకుగా కనిపించేందుకు యువత కడుపు మాడ్చుకుంటారు. అది చాలా ప్రమాదం

ఎన్ని పనులున్నా టైమ్ తింటే ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదని వైద్యనిపుణుల సూచన

భోజనానికి ముందు చిరుతిండి, తీపి తినడం వలన ఆకలి నశించే అవకాశం ఉంది

సమయానికి భోజనం, అవసరమైన నీరు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు

ఇకనైనా ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణుల సలహా