ప్రెజర్‌ కుక్కర్‌లో అన్నం వండుతున్నారా? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..

ప్రెజర్‌ కుక్కర్‌లో అన్నం వండడం మంచిదేనని నిపుణులు అంటున్నారు.

ప్రెజర్‌ కుక్కర్‌లో అన్నం వండితే రుచికరంగా ఉంటుంది.

ప్రెజర్ కుక్కర్‌లో అన్నం వండడం వల్ల త్వరగా అయిపోతుంది.

ప్రెజర్‌ కుక్కర్‌లో అన్నం వండితే అది పిండిని ఎక్కువగా నిలుపుకుంటుంది.

దీంతో కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉంటుంది.

ఈ కారణంగా ఆకలి తక్కువగా వేస్తుంది.

ప్రెజర్‌ కుక్కర్‌లో అన్నం వండినప్పుడు బియ్యం ఎక్కువ శాతం ఉడుకుతుంది.

ఇది జీర్ణక్రియకి అనుకూలంగా ఉంటుంది.

అన్నం యొక్క స్వభావం మారకుండా అలానే ఉంటుంది.

అధిక ప్రెజర్‌ వల్ల అన్నంలో పోషకాలు అలానే ఉంటాయి.

ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అధిక ప్రెజర్‌తో అన్నం ఉడకడం వల్ల.. ఫంగస్‌, ఇతర బ్యాక్టీరియా ఏమైనా ఉంటే తొలగిపోతాయి.

ప్రెజర్‌ కుక్కర్‌లో వండడం వల్ల ప్రోటీన్‌, స్టార్చ్, ఫైబర్ వంటి సూక్ష్మమైన పోషకాలు అందులోనే ఉంటాయి.

కాబట్టి ప్రెజర్‌ కుక్కర్‌లో అన్నం వండుకు తినడం ఆరోగ్యానికి మంచిదే.