ప్రస్తుత జీవనశైలిలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం.

మానవ శ్వాస వ్యవస్థలో ఊపిరితిత్తులు ప్రధాన అవయవాలు. ఇవి మ‌నం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజ‌న్‌ను గ్రహించి రక్త ప్రవాహంలోనికి పంపిస్తాయి. 

పెరిగిపోతున్న కాలుష్యం, అపరిశుభ్ర పరిసరాలు, స్మోకింగ్‌‌ , వివిధ రకాల వైరస్‌లు ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నాయి.

దీంతో ఊపిరితిత్తులలో విష వ్యర్థాలతో నిండిపోయి అనేక సమస్యలు దరి చేరుతున్నాయి.

ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం, వాటి సామర్థ్యం పెంచుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఊపిరితిత్తులలో పేరుకుపోయిన వ్యర్థాలను ఎలా శుభ్రం చేసుకోవాలో ఈ టిప్స్‌ ద్వారా తెలుసుకుందాం.

వేడి నీటితో ఆవిరి పడితే ముక్కు రంధ్రాల్లో ఉన్న పూడికలు తొలగిపోతాయి. వేడి ఆవిరి పీలిస్తే.. శ్వాస బాగా ఆడుతుంది.

ఊపిరితిత్తులలోని శ్లేష్మం క్లీన్‌ చేయడానికి దగ్గు ఉత్తమమైన మార్గం. కావాలని దగ్గితే.. ఊపిరితిత్తులలోని అదనపు శ్లేష్మం బయటకు వస్తుంది.

అల్లంలోని ఔషద గుణాలు ఊపిరితిత్తులకు బాగా పని చేస్తాయి. ఇవి వాయునాళాలలో ఉన్న పొగాకు పొగను, దుమ్ము, దూళిని తొలగిస్తాయి.

మన శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి పసుపు సహాయపడుతుంది.

యోగా చేయడం ద్వారా కూడా ఊపిరితిత్తుల కండరాల నుంచి వ్యర్థాలను తొలగిస్తుంది. మరీ ముఖ్యంగా సుఖాసనం  మీ దృష్టిని ఏకాగ్రతను పెంచడమే కాకుండా శ్వాస సంబంధిత సమస్యలను, దగ్గు, జలుబు వంటి సమస్యలను దూరం చేస్తుంది.

 ఊపిరితిత్తులను ఎప్పటికప్పుడు శుభ్ర పరుచుకుని ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి టిప్స్ పాటించాలిన ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.