మనకు తినేందుకు అనేక రకాల నట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పిస్తా పప్పు కూడా ఒకటి. పిస్తా పప్పులు మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ఈ పప్పుల్లో ఫైబర్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

అధిక బరువును తగ్గించేందుకు, గుండెను, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఈ పిస్తా పప్పుల్లో అధికంగా ఉంటాయి. 

 అయితే రోజూ గుప్పెడు  పిస్తా తిన్నడం వల్ల కలిగే  ప్రయోజానాలు  ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...  

కళ్ళు ఆరోగ్యంగా ఉండటంలో పిస్తా కూడా  ప్రధాన పాత్ర పోషిస్తుందంట. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ A కంటి ఆరోగ్యానికి  చాల ముఖ్యమైన విటమిన్. కాబట్టి  కళ్ళకు సంబంధించిన సమస్యలను నివారించాలనుకుంటే పిస్తా తినాలి.

ప్రతి ఏడాది లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు. అయితే పిస్తా పప్పులు కీమో నివారణ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల రాకుండా ఉండేందుకు పిస్తా పప్పులను తీసుకోవడం మంచిది.

ఈ పిస్తా తీసుకోవడం గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందంట. పిస్తా పప్పులో గుండెను కాపాడే ప్రోటీన్ లు ఉంటాయి. అందువల్ల, గుండె జబ్బులను నివారించడానికి మీరు క్రమం తప్పకుండా పిస్తా తినవచ్చు.

పిస్తా పప్పులో ఉండే ఫైబర్, ప్రోటీన్లు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అందువల్ల వీటిని తింటే చాలా సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా అధిక బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.  

పిస్తా పప్పులో ఎల్-అర్గైనైన్ అనబడే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్గా మారుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

పిస్తాకు న్యూరో కాపాడే శక్తి ఉంటుంది. కాబట్టి  రోజూ నాలుగైదు పిస్తా పప్పులు తీసుకుంటే అది  మెదడు పనితీరు చురుకుగా పనిచేసేలా చేస్తుంది.  పిస్తా పప్పు తీసుకోవడం ద్వార మెదడు సంబంధిత సమస్యల నుండి రక్షింపబడతాం.

పిస్తా పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం కొలెస్ట్రాల్, బీపీలను తగ్గిస్తాయి. అందువల్ల వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్ను తగ్గించుకోవచ్చు.

డయాబెటిస్ తో బాధపడేవారు పిస్తాను తీసుకోవడం మంచిదంట. నిత్యం రెండు గుప్పెళ్ల మోతాదులో 12 వారాల పాటు పిస్తాపప్పును తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు 20 నుంచి 30 శాతం వరకు తగ్గాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తేలింది.

పిస్తాలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచడంలో తోడ్పడుతుంది. అందువల్ల, అందరు క్రమం తప్పకుండా పిస్తా తినాలి.  మరిన్ని సలహాల కోసం వైద్యుల సంప్రదించటం ఉత్తమం.