బిజీబిజీ జీవితంలో త్వరగా నిద్రపోవడం అనేది చాలా కష్టంగా మారింది. ప్రస్తుత జీవన విధానం వల్ల చాలా మంది ఒత్తిడికి గురి అవుతుంటారు. ఈ ప్రభావం, మరికొన్ని కారణాలతో రాత్రుళ్లు త్వరగా నిద్రపోవడంలేదు.
రాత్రుళ్లు త్వరగా నిద్ర పోకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ చిట్కాలు పాటిస్తే మీరు త్వరగా నిద్రలోకి జారుకుంటారు.
పాలు అనేది శరీర ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు త్వరగా నిద్రపోయేందు ఉపయోగపడుతుంది. రాత్రి నిద్రపోవడానికి కొంత సమయం ముందు గోరు వెచ్చని పాలు తాగడం చాలా మంచిది. దీని ద్వారా హాయిగా నిద్రలోకి జారుకోవచ్చు.
అన్నికంటే ముఖ్యంగా నిద్రపోవడానికి ఓ గంట ముందు నుంచి మొబైల్ చూడటం మానేయాలి. నిద్రను దూరం చేసే వాటిల్లో ప్రధానమైనది మొబైల్ వాడకం.
చేతివేళ్లతో లేదా దువ్వెనతో జట్టును మృదువుగా దువ్వుకోవడం వలన నిద్ర త్వరగా వస్తుంది. ఇది తల ద్వార మెదడుకు ఓ రకమైన మర్దనం లాంటిది.
పడుకునే ముందు నాటు ఆవు నెయ్యి గోరు వెచ్చగా చేసుకొని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకొని పడుకోవాలి.
గసగసాలను లైట్ గా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాటి వాసన పీల్చడం తో త్వరగా నిద్రలోకి జారుకోవచ్చు.
రాత్రి పడుకునే ముందు అరికాళ్లకు ఆముదం లేదా కొబ్బరి నూనెతో మర్దనం చేయడం మంచి. దీని ద్వారా మెదడు ప్రశాంతత స్థితిలోకి వెళ్తుంది. దీంతో త్వరాగా నిద్రలోకి జారుకోవచ్చు.
ప్రతి రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు కొద్ది సమయం ధ్యానం చేయాలి. దీని ద్వారా మైండ్ ప్రశాంతమైన స్థితికి చేరి.. త్వరగా నిద్రపోయేల మనిషిని ప్రేరేపిస్తుంది.