ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికైనా కాస్త బ్రేక్ కావాలి.
ఎక్కడికి వెళ్లినా మనల్ని కాలుష్యం అనే మహమ్మారి వెంటాడుతూనే ఉంటుంది.
అయితే ఇప్పుడు చెప్పుకోబోయే నగరాలకు వెళ్తే మాత్రం మీకు ఎంతో స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది.
కర్ణాటకలోని మైసూర్.. బెస్ట్ ఎయిర్ క్వాలిటీ ఉన్న నగరాల్లో మైసూర్ కూడా ఒకటి.
మిజోరాం రాజధాని ఐజ్వాల్ అత్యంత స్వచ్ఛమైన గాలి ఉండే ప్రాంతాల్లో ఒకటి.
మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియాగా పేరు గాంచిన కోయంబత్తూరు కూడా స్వచ్ఛమైన గాలి ఉండే ఒక ప్రాంతం.
ఇక్కడ మరుధమలై ఆలయం, కోవై కొడట్టం, ఆదియోగి విగ్రహం, వైదేహీ జలపాతం వంటివి చూడచ్చు.