భారత దేశం అనేక దేవాలయాలకు పుట్టినిల్లు. ఈ దేవాలయాలు పురాతన సంస్కృతికి, సంప్రదాయాలకు నిదర్శనాలు. ఏళ్లు గడుస్తున్న వన్నె తగ్గకుండా ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని ఇప్పటికి చాలా ఆలయాలు  యాత్రికులను ఆకర్షిస్తున్నాయి.

ప్రస్తుత  భారతదేశంలో వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన కొన్ని ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఆలయం మహారాష్ట్రలోని ఎల్లోరా ప్రాంతంలో ఉంటుంది. కైలాసదేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయం. క్రీ.శ.8వ శతాబ్దంలోని ఈ కైలాసదేవాలయాని నిర్మించడానికి దాదాపు 150ఏళ్ళు పట్టిందట.

కైలాస దేవాలయం

కైలాసదేవాలయం ప్రత్యేకత విషయానికివస్తే ఇక్కడ ఒక గోడకు చెక్కిన నటరాజ విగ్రహానికి వెయ్యి ఏళ్ల క్రితం వేసిన రంగు ఇప్పటికీ వుండటం విశేషం.

కైలాస దేవాలయం

 ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ క్షేత్రం గురించి మీరు వినే వుంటారు. ఇక్కడ విష్ణుమూర్తి కొలువైవున్నారు. భూలోక వైకుంఠంగా పిలవబడుతున్న బద్రీనాథ్ క్షేత్రం హిమాలయాల్లో 10,000అడుగుల ఎత్తున వుంది.

బద్రీనాథ్ క్షేత్రం

బద్రీనాథ్ క్షేత్రంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయవలసిన అవసరం లేదని అంటారు.

బద్రీనాథ్ క్షేత్రం

పురాతన ఆలయాల్లో కుంభకేశ్వర ఆలయం ఒకటి. ఈ గుడిలో కుండలను తయారు చేసే మట్టితో శివలింగాన్ని ప్రతిష్టించారు. తమిళనాడులోని కుంభకోణంలో ఈ ఆలయంలో కలదు. 

కుంభకేశ్వర ఆలయం

ఈ ఆలయాని క్రీ.శ. 9వ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించారని చరిత్రకారు చెబుతున్నారు.

కుంభకేశ్వర ఆలయం

ముండేశ్వర్ పుణ్యక్షేత్రం అతి పురాతన ఆలయాలో ఒకటి. ఈ ఆలయం బీహార్ లో కైమూర్ జిల్లాలో ఉంది. ముండేశ్వర్ పుణ్యక్షేత్రాని క్రీ.శ.108వ సంవత్సరంలో నిర్మించారని చరిత్రకారులు పేర్కొన్నారు. 

ముండేశ్వర్ పుణ్యక్షేత్రం

ముండేశ్వర్ పుణ్యక్షేత్రంలో నాలుగు ముఖాలు గల శివుడి విగ్రహం ప్రత్యేకం.

ముండేశ్వర్ పుణ్యక్షేత్రం

షోర్ టెంపుల్ తమిళనాడులోని మహాబలిపురంలో బంగాళాఖాతం తీరాన ఉన్నది. దీనిని క్రీ.శ. 700 లో పల్లవుల రాజు రెండవ నరసింహవర్మన్ కాలంలో నిర్మించారు. దక్షిణ భారతదేశంలో పురాతన కట్టడాలలో ఇది ఒకటి.

షోర్ టెంపుల్

సోమనాథ ఆలయం అంటే ఠక్కున గుర్తుకొచ్చేది మహమ్మద్ గజినీ దండయాత్రలు. ఈయన ఇక్కడ సంపదను కొల్లగొట్టి, దేవాలయాన్ని నాశనం చేసాడు. జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన సోమనాథ ఆలయం గుజరాత్ రాష్ట్రంలో కలదు. దీనిని సేయున వంశీయులు శివుని మీద ఉన్న భక్తితో క్రీ.శ. 7 వ శతాబ్దంలో నిర్మించారు.

సోమనాథ ఆలయం