సినిమా చూడాలా.. వద్దా.. అన్న నిర్ణయం తీసుకునేది ప్రేక్షకుడు అయినా.. సినిమా ఎంత గొప్పగా ఉంది అనేది డిసైడ్ చేసేదే క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ ని ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తే సినిమా అంత హిట్ అవుతుంది.
కథ, కథనం పక్కాగా ప్లాన్ చేసుకున్నా క్లైమాక్స్ లో కొంచెం తేడా కొట్టిందంటే.. ఆ చిత్రం వసూళ్లు రాబట్టడం కష్టమే. అందుకే చిత్రాన్ని నిర్మించేటప్పుడు.. ప్రేక్షకుడికి ఆ సీన్ ఇంకోలా ఉంటే బాగుండేదిగా అనిపించకుండా ప్లాన్ చేయాలి.
ఇప్పుడు క్లైమాక్స్ ఇలా కాకుండా ఇంకోలా ఉంటే బాగుండు అనిపించే 10 సినిమాలని చూద్దాం..