వానాకాలంలో వాతావరణం మార్పుల వల్ల అనారోగ్యం చుట్టు ముడుతుంది. ముఖ్యంగా జలుబు అతి పెద్ద సమస్యగా మారుతుంది. దీని వల్ల  దగ్గు, జ్వరం వెంటనే వచ్చేస్తాయి. 

అందువల్ల.. వానాకాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బయట ఫుడ్ జోలికి అస్సలే వెళ్లకూడదు.

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకుంటే ఈ కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు.

వానాకాలంలో ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటి వల్ల జలుబు, దగ్గు లాంటి రోగాల నుండి బయట పడవచ్చని చెబుతున్నారు. అల్లం తీసుకుంటే మంచి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

అల్లం

 వెంటనే జలుబు నుండి రిలీఫ్ పొందవచ్చు. అల్లం ఛాయ్ తాగినా మంచి ఫలితం ఉంటుంది. కూరల్లో వేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతం అవుతుంది.

అల్లం

వానాకాలంలో కొబ్బరి నీళ్లు తాగుతారా!అని మీకు అనిపించొచ్చు. వర్షాకాలంలో ఎక్కువగా దాహం వేయదు. అందుకని చాలా మంది తక్కువగా నీరు తాగుతుంటారు. తక్కువ నీటిని తాగడానికి మరో కారణం.. పదే పదే బాత్రూమ్ కు వెళ్లాల్సి వస్తుందని. 

కొబ్బరి నీళ్లు

ఇలా తక్కువ నీళ్లు తాగితే డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో కొబ్బరి నీళ్ల తాగితే మంచి ఉపశమనం దొరుకుతుంది. ఎప్పుడూ హైడ్రేషన్ గా ఉండేందుకు ఇవి చక్కగా పని చేస్తాయి. ఇందులోని ఎలక్ట్రోలైట్స్ అన్ని రకాలుగా మంచివి.

కొబ్బరి నీళ్లు

వెల్లుల్లి మంచి ఆరోగ్య ప్రధాయిని. ఇది రుచిని అందివ్వడమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వెల్లుల్లి తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పోషకాహార వైద్యులు చెబుతున్నారు. 

వెల్లుల్లి

వెల్లుల్లిని కూరల్లో భాగం చేసుకుని రోజూ తీసుకుంటే.. ఇమ్యూనిటీ పెరగడంతో పాటు జలుబు, ఫ్లూ వంటి సమస్యల్ని తరిమి కొట్టవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వెల్లుల్లి

వానాకాలంలో వేడి వేడి సూప్ తాగుతుంటే చాలా బాగుంటుంది. గోరు వెచ్చని సూప్ తాగడం వల్ల గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ లాంటి సమస్యల నుండి బయట పడవచ్చు. సూప్ త్వరగా జీర్ణం అవుతుంది. సూప్ లో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్ లు పుష్కలంగా ఉంటాయి. 

సూప్

వెజ్ సూప్స్, చికెన్ సూప్స్, గార్లిక్ సూప్స్ ఇలా పలు రకాల సూప్స్ ను ట్రై చేయవచ్చు. ఇందులోకి కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకుంటే ముక్కు దిబ్బడ నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. మసాలాలు కలిపినా చక్కని ప్రయోజనం ఉంటుంది.

సూప్

వానాకాలంలో ప్రోటీన్ ఫుడ్స్ చాలా మేలు చేస్తాయి. సాల్మన్ చేపలు, గుడ్లు, చికెన్, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇవి శరీర జీర్ణ క్రియ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతాయి. 

ప్రోటీన్ ఫుడ్స్

అనవసరమైన కొవ్వును కరిగించడంలో చేపల్లో విటమిన్లు ఉపయోగపడతాయి. వానాకాలంలో దొరికే పండ్లను తీసుకోవాలి.

ప్రోటీన్ ఫుడ్స్

అంతేకాకుండా..  వేడి వేడి ఆహారాన్ని తీసుకోవాడం చాలా ఉత్తమం. కొంత చలిగా ఉంటుంది కాబట్టి వేడి భోజనం చేస్తే ఉపశమనం పొందిన ఫీలింగ్ కలుగుతుంది. వీటితో పాటు జలుబు చేస్తే తరచూ ఆవిరి పట్టుకోవాలి. ఈ విధంగా కూడా జలుబు నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.