15వ భారత రాష్ట్రపతిగా ప్రమాణ  స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము.

1958 జూన్ 20న ఒడిశాలోని    బైడపోసి గ్రామంలో జన్మించారు.

 గిరిజన వర్గంలోని సంథాల్ తెగలో  పుట్టారు.

భువనేశ్వర్లోని రమాదేవి మహిళా  కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.

డిగ్రీ అనంతరం సాగునీటి-విద్యుత్తు  శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పని చేశారు.

శ్రీ అరబిందో సమీకృత విద్యా  కేంద్రంలో స్వచ్ఛందంగా     ఉపాధ్యాయురాలిగా పని చేశారు.

1997లో బీజేపీ తరపున  రాయ్రంగ్పూర్ నగర పంచాయతీ  కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. 

2000 సంవత్సరంలో రాయ్రంగ్పూర్  నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

బీజేడీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో  2000-2004 మధ్య వాణిజ్య, రవాణా

మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రిగా  వ్యవహరించారు.

2004లో మరోసారి ఎమ్మెల్యేగా  విజయం సాధించారు.

2010, 2013లో రెండుసార్లు మయూర్భంజ్  పశ్చిమ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు  నిర్వర్తించారు.

2013లో ముర్ము బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ  కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు.

2015 మే 18న జార్ఖండ్ గవర్నర్గా  నియమితులయ్యారు. 

2021 జూన్ 12 వరకు ఆ పదవిలో కొనసాగారు. 

జార్ఖండ్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్గా  ద్రౌపది ముర్ము చరిత్రకెక్కారు. 

రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన మొట్ట  మొదటి గిరిజన మహిళగా రికార్డు  సృష్టించారు.