ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్.. మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది

యూజర్లు తమ ఆన్‌లైన్ స్టేటస్‌ను దాచి పెట్టేలా చేసే ఫీచర్‌ను వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.

తాము ఆన్‌లైన్‌లో ఉన్న విషయం గోప్యంగా ఉంచాలనుకునే వినియోగదారులకు  ‘హైడ్ ఆన్‌లైన్ స్టేటస్’ ఫీచర్ బాగా ఉపయోగపడనుంది.

వాట్సాప్‌లో మన ఉనికి ఇతరులకు తెలియకుండా ఉండేందుకు లాస్ట్‌ సీన్‌, స్టేటస్‌ హైడ్ వంటి ప్రైవసీ ఫీచర్లు ఇప్పటికే ఉన్నాయి.

వీటికి మరో ఇంటరెస్టింగ్ ఫీచర్ ను జోడించనుంది.

ఛాట్‌ పేజీలో యూజర్‌ ఐకాన్‌ కింద ఆన్‌లైన్‌ స్టేటస్‌ ద్వారా యూజర్‌ ఆన్‌లైన్‌లో ఉన్నారా? ఆఫ్‌లైన్‌లో ఉన్నారా? అనేది తెలుస్తుంది.

అక్కడ స్టేటస్‌ ఆన్‌లైన్‌ అని చూపిస్తే, యూజర్‌ ఆన్‌లైన్‌లో ఉన్నట్లు. ఒకవేళ ఆన్‌లైన్‌ అని చూపించకుంటే ఆఫ్‌లైన్‌లో ఉన్నట్లుగా భావించాలి.

అయితే.. వాట్సాప్‌ తాజాగా తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్లు ఈ స్టేటస్‌ కూడా ఇతరులకు కనబడకుండా చేయొచ్చు.

అంటే ఆన్‌లైన్‌లో ఉన్నట్లు అవతలి వారికి తెలియదు.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉందని, ఇందులో రెండు ఆప్షన్లు యూజర్లు అందబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది.

తాజా రిపోర్టుల ప్రకారం ఈ గోప్యతా సెట్టింగ్ Android వెర్షన్ 2.22.16.12 కోసం అందుబాటులో ఉంది.

ఈ ఫీచర్‌ను ఎంచుకోవడం ఎలా?

Settings-> Account-> Privacy-> Last seen లో ఉండే లాస్ట్‌ సీన్‌ అనే దాంట్లోనే ఈ ఫీచర్‌ కూడా ఉండనుంది.

లాస్ట్‌ స్టీన్‌ ఆప్షన్‌ ఎనేబుల్‌, డిసేబుల్‌ చేసుకునే విధంగానే ఈ ‘హైడ్ ఆన్‌లైన్ స్టేటస్’ ఆప్షన్‌ను పొందుపర్చనుంది.

వాట్సాప్.. తీసుకొస్తున్న ‘హైడ్ ఆన్‌లైన్ స్టేటస్’ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.