గురక అనేది చాలా సాధారణంగా కనిపించే సమస్య. ప్రతి ఒక్కరు ఏదో ఓ సందర్భంలో గురక పెడతారు. కానీ ఎంతకు తగ్గకపోతే.. ఈ చిట్కాలు పాటించండి.

ఒక గ్లాసు వెచ్చటి నీరు తీసుకుని.. అందులో అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి కలపి రాత్రి నిద్ర పోయే ముందు తాగడం వల్ల గురక తగ్గుతుంది.

యాలకుల పొడి

ఒక కప్పు వెచ్చని పాలలో రెండు టేబుల్ స్పూన్ల పసుపు కలపి రోజూ నిద్రకు ఉపక్రమించడానికి ముందు  తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

పసుపు పాలు తాగండి..

గురక స్లిప్ అప్నియా అనే రుగ్మతకు సూచిక కావచ్చు. దీని వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

స్లీప్ అప్నియా

పొగతాగే వారిలో శ్వాస మార్గం వాచిపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఆటంకం ఏర్పడుతుంది. కనుక పొగ తాగే అలవాటు మానుకోవాలి.

‘పొగ’ మానేయండి

పడుకున్నప్పుడు ఒక్కోసారి నాలుక వెనక్కి వెళ్లి గొంతులో అవరోధంగా మారొచ్చు.

దిండును వాడండి..

తల కింద దిండు ఉంచుకోవడం వల్ల దీన్ని నివారించొచ్చు. శ్వాస మార్గానికి ఆటంకం కలగకుండా చూడొచ్చు.

దిండును వాడండి..

అధిక బరువు వల్ల గురక వచ్చే అవకాశం ఉంది. కనుక బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయండి.

బరువు తగ్గించుకోండి..

గురకను నివారించడానికి రాత్రిపూట ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి.

ఆల్కహాల్ వద్దు

నాలుక, గొంతులోని కండరాలు దృఢంగా ఉండేలా చూసుకోవాలి. ఈ కండరాలు బలంగా ఉండటం వల్ల గురక సమస్య తగ్గుతుంది.

నాలుక, గొంతు సంబంధ వ్యాయామం..

ప్రాణాయామం చేయడం వల్ల శ్వాసపై నియంత్రణ లభిస్తుంది. గురకతోపాటు నిద్ర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ప్రాణాయామం చేయండి..