మనం తినే ఆహరం నిద్రపై ప్రభావం చూపుతుంది.

నిద్రపోయే ముందు ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహరం తినకూడదు.

నిద్రపోయే సమయంలో శరీర అవయవాలు నిదానంగా పని చేస్తాయి.

దీని వల్ల జీర్ణ ప్రక్రియ ఆలస్యం అవుతుంది.  

కొవ్వు కరగడం ఆలస్యం అవుతుంది. 

దీని వల్ల బరువు పెరిగి గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.  

కాబట్టి వీటిని దూరం పెట్టండి. 

పిజ్జా, బర్గర్లు తినడం మంచిది కాదు. 

కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 

చిల్లీ సాస్, టమాటా సాస్ వల్ల అసిడిటీ సమస్యలు వస్తాయి. 

చాక్లెట్స్ లో కెఫిన్, కోకా మోతాదు ఎక్కువగా ఉంటుంది.

పీచు పదార్దాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.

లిక్కర్, కార్బోనేటెడ్ డ్రింక్స్, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ దూరం పెట్టండి. 

షుగర్ క్యాండీస్ లో షుగర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.  

రాత్రి సమయంలో నిద్రపోయే ముందు వీటిని తినకపోవడం మంచిది. 

అప్పుడే మంచి నిద్ర మీ సొంతమవుతుంది.