యోగా రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం వల్ల అనేక లాభాలుంటాయి.

శారీరకంగా, మానసికంగా సుఖశాంతులు, ఆరోగ్యం పొంది ఆత్మవికాసం పెరుగుతుంది.

శ్వాసక్రియలో ఇబ్బందులు లేకుండా సులభంగా ఉంటుంది.

అందం, కోమలత్వం, ముఖంమీద కాంతి కూడా చేకూరుతాయి.

యోగా చేయడం వల్ల అన్ని గ్రంథులు నియమంగా స్రవిస్తాయి

 అలసట మాయమై శరీరం తేలికగా చురుకుగా ఉంటుంది.

ఏకాగ్రత, అంతర్ముఖ తత్త్వాల వలన వ్యావహారిక జీవితాన్ని చక్కదిద్దుకోగలం

మధుమేహం, ఆస్తమా, రక్తపుపోటు, గుండెనొప్పి, నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పి, అజీర్తి లాంటి దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి

శరీరం వివిధ రకాల ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధులతో సమర్ధవంతంగా పోరాడి మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది

నిద్రలేమిని తరిమికొట్టడానికి యోగ బాగా సహాయపడుతుంది 

రక్తపోటుని తగ్గించడానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుంది

గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది

రక్తంలో ఉన్న ట్రై గ్లిజరాయిడ్స్ సంఖ్యను యోగ తగ్గిస్తుంది