రావి చెట్టుకు మన సమాజంలో మరీ ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇటు ఆరోగ్య పరంగా చూసుకున్న అనేక వ్యాధులను తగ్గిస్తుంది. రావి చెట్టు అనేక ఔషధ విలువలకు నిలయం. అనేక రోగాలను మాయం చేసే శక్తి రావి ఆకులకు ఉంది.

డయేరియా తగ్గిస్తుంది

రావి చెట్టు కాండం, ధనియాలు, పట్టిక బెల్లం సమపాళ్లలో తీసుకొని బాగా మిక్స్ చేసి 3-4 గ్రాముల చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకుంటే డయేరియా తగ్గుతుంది.

ఆకలి పెంచుతుంది.. 

బాగా పక్వానికి వచ్చిన రాగి పండ్లు తినడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది. అంతేకా దగ్గు, కడుపులో మంట, వాంతులు కూడా తగ్గుతాయి. 

ఆస్తమాను కట్టడి చేస్తుంది...

రావి బెరడు, మగ్గిన పండ్లను తీసుకోని.. వాటిని విడిగా పొడి చేసి, సమాన మోతాదుల్లో కలపాలి.

రోజుకు మూడుసార్లు దీన్ని తీసుకోవడం వల్ల ఆస్తమా తగ్గుతుంది.

ఎండిన రావి పండ్లను పొడిగా చేసుకొని రోజూ రెండు పూటలా 2-3 గ్రాముల చొప్పున రెండు వారాలపాటు తీసుకోవాలి.

ఇలా చేస్తే ఆస్తమా త్వరగా తగ్గుతుంది.

పాము కాటుకు విరుగుడుగా..

పాము కరిచిన వారికి రావి ఆకుల రసాన్ని రెండు స్పూన్ల చొప్పున మూడు నాలుగు సార్లు ఇస్తే.. విషం ప్రభావం తగ్గుతుంది.

చర్మ సమస్యల నివారణకు.. 

లేత రావి ఆకుల్ని తినడం వల్ల దురద సమస్యలు, ఇతర చర్మ వ్యాధులు తగ్గుతాయి. 

చర్మ సమస్యల నివారణకు.. 

ఈ ఆకుల్ని మరిగించి 40 ఎం.ఎల్. మోతాదులో టీ రూపంలో తాగడం వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుంది.

తామరకు చెక్‌..

తామరతో బాధపడేవారు 50 గ్రాముల రావి బెరడును బూడిదగా చేసుకొని దానికి నిమ్మ రసం, నెయ్యి కలపాలి.

ఆ పేస్టును తామర సోకిన చోట రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

రావి బెరడును నీటిలో మరిగించి 40 ఎం.ఎల్. చొప్పున తాగినా ఫలితం ఉంటుంది.

రావి గింజలతో రక్త శుద్ధి..

రెండు గ్రాముల రావి గింజల పొడిని తేనెతో కలిపి రోజుకు 2సార్లు తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.

మలబద్ధకం సమస్యకు చెక్‌..

రావి ఆకులను ఎండబెట్టి వాటిని పొడి చేసి..  దానికి సోంపు గింజలు, బెల్లం సమపాళ్లలో కలపాలి.

ఈ మిశ్రమాన్ని గ్లాసు నీళ్లలో కలిపి తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. 

రోజుకు 5-10 రావి పండ్లను తిన్నా మలబద్ధకం సమస్య పూర్తిగా తగ్గుతుంది.

లైంగిక సామర్థ్యం పెంపొందడానికి..

నపుంసకత్వం సమస్య నుంచి బయటపడటానికి కూడా రావి ఉపయోగపడుతుంది. 

అర స్పూన్ రావి పండ్ల పొడిని పాలలో కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. తద్వారా శరీరానికి బలం వచ్చి, నపుంసకత్వం నుంచి బయటపడొచ్చు. 

తగిన మోతాదులో రావి పండ్లు, దాని వేర్లు, శొంఠిని కలపాలి. పాలు, తేనె, పట్టిక మిశ్రమానికి దీన్ని కలిపి తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

మడమల పగుళ్లు తగ్గడానికి..

రావి ఆకుల గుజ్జు లేదా వాటి పాలను కాలికి పగుళ్లు వచ్చిన చోట రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కామెర్లు తగ్గడానికి

కామెర్లకు రావి ఆకులు చక్కటి మందుగా ఉపయోగపడుతుంది. 

3-4 తాజా రావి ఆకులు తీసుకొని దానికి  పట్టిక బెల్లం కలిపి పొడిగా చేసుకోవాలి. ఆ పౌడర్‌ను పావు లీటర్ నీటిలో కలిపి వడగట్టాలి.

రోజుకు రెండుసార్ల చొప్పున ఐదు రోజులపాటు ఈ మిశ్రమాన్ని తాగించడం వల్ల కామెర్లు తగ్గుముఖం పడతాయి.

వెక్కిళ్లు తగ్గడానికి...

వంద గ్రాముల రావి బెరడును బూడిదగా మార్చి.. దాన్ని నీటి కలిపి తాగడం వల్ల వెక్కిళ్లు తగ్గుతాయి.

కడుపు నొప్పిని తగ్గించే రావి ఆకులు..

కడుపు నొప్పితో భాదపడుతున్నవారు రెండు మూడు రావి ఆకులను పేస్ట్‌గా చేసుకొని 50 గ్రాముల బెల్లంలో కలిపి చిన్న మాత్రలుగా చేసుకోవాలి.

కడుపు నొప్పిని తగ్గించే రావి ఆకులు..

దీన్ని మూడు పూటలా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది.

పంటి నొప్పి పరార్‌..

దంత సమస్యలకు రావి, మర్రి చెట్ల బెరడు ఉపయోగపడుతుంది. ఈ రెండు చెట్ల బెరడును సమ మోతాదులో కలిపి తీసుకొని ఉడికించాలి.

పంటి నొప్పి పరార్‌..

ఆ మిశ్రమాన్ని వేడి నీటిలో కలిపి.. ఆ నీటితో నోటిని పుక్కిలించడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది.