యంత్తంగ్ వాలీ దీనిని 'వాలీ ఆఫ్ ఫ్లవర్స్' గా పిలుస్తారు. ఇది సముద్ర మట్టానికి 3564 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం. ఇక్కడ హిమాలయాలు, రోడోడెండ్రాన్ అభయారణ్యం చూడదగ్గవి.
గోవా.. పర్యాటక రంగం మీదనే ఆధారపడ్డ ఒక చిన్న రాష్ట్రం. బీచ్ లు, సముద్ర ఆహార రుచులు పెట్టింది పేరు. ఇక్కడ పారాగ్లైడింగ్, వాటర్ బైక్, బనానా బోట్ ఆటలు ఇక్కడ ప్రసిద్ది
కొంకణ్ రైలు ప్రయాణం.. ఈ ప్రాంతం గుండా రైలులో ప్రయాణిస్తే జలపాతాలు, పశ్చిమ కనుమల పర్వతాలు, పచ్చిక మైదానాలు, గంభీరమైన చీకటి టన్నెల్ లు గమనించవచ్చు.
ఒరిస్సా గోల్డెన్ ట్రయాంగిల్.. పూరి - కోణార్క్- భువనేశ్వర్ హెరిటేజ్ ప్రదేశాలను కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఈ మూడు చోట్ల దేవాలయాలే ఫెమస్.
గోల్డెన్ టెంపుల్.. జీవితంలో ఒక్కసారైనా అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం చూడాలి. గురుద్వారా యొక్క పై అంతస్తును 400 కేజీలతో బంగారంతో పూతవేసారు.
తాజ్ మహల్.. ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటి తాజ్ మహల్. ఆగ్రా ను సందర్శించటానికి పర్యాటకులు ఎప్పడూ వస్తుంటారు.
మైసూర్ కర్ణాటక సాంస్కృతిక రాజధాని. మైసూర్ పాలెస్, చాముండేశ్వరి దేవాలయం, బృందావన్ గార్డెన్ చూడదగ్గ వాటిలో ముఖ్యమైనవి.
హైదరాబాద్.. భారత దేశంలో ప్రసిద్ద నగరాల్లో ఒకటి హైదరాబాద్.. ఇక్కడ సందర్శన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. చార్మినార్, గోల్కొండ, బిర్లా మందిర్, హుస్సేన్ సాగర్,దుర్గం చెరువు మొదలైనవి చూడదగ్గవి.
ఉండవల్లి గుహలు.. క్రీ. శ. 4 లేదా 5 వ శతాబ్దానికి చెందినవి. నల్లని గ్రానైట్ రాయితో పడుకున్న భంగిమలో చెక్కబడిన 'అనంతశయన విష్ణువు' యొక్క భారీ ఏకశిలా విగ్రహం కలదు. ఈ గుహలు విజయవాడకు 6 కి. మీ ల దూరంలో ఉన్నాయి.
వైజాగ్.. ఇక్కడ ఆర్కే బీచ్, కైలాస గిరి, కంబాలకొండ, రామకృష్ణ బీచ్, మెరైన్ మ్యూజియం తో పాటు జిల్లాలో ఉన్న అరకులోయ, బొర్రా గుహలు, అనంతగిరి హిల్స్ చూడదగ్గవి.